Asia Cup 2025: ఆసియా కప్ సమరానికి ముహూర్తం ఫిక్స్! భారత్- పాక్ మ్యాచ్‌ జరుగుతుందా? క్లారిటీ ఇదిగో

భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది.

Asia Cup 2025: ఆసియా కప్ సమరానికి ముహూర్తం ఫిక్స్! భారత్- పాక్ మ్యాచ్‌ జరుగుతుందా? క్లారిటీ ఇదిగో
Team India

Updated on: Jun 29, 2025 | 6:47 PM

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ను అన్ని విధాలుగా దెబ్బ తీసింది. ఈ చర్యతో ఇరు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత దేశం చాలా వరకు పాకిస్తాన్ తో సంబంధాలను తెంచుకుంది. ఇప్పుడు దీని ప్రభావం క్రీడల్లోనూ కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కారణంగా, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. అయితే, ఇప్పుడు ACC అంటే ఆసియా క్రికెట్ కమిటీ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 10 నుండి ప్రారంభం కావచ్చు. 2025 ఆసియా కప్ టోర్నమెంట్‌ ఆతిథ్య హక్కులు మన దగ్గరే ఉన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 కూడా ఇండియాలోనే జరుగుతుంది. ఆ నేపథ్యంలో, ఆసియా కప్ టోర్నమెంట్ కూడా టి20 ఫార్మాట్ ప్రకారం జరుగుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌కు ముందు, రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు భారతదేశం-పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుమతితో మూడవ వేదికలో నిర్వహించాలని నిర్ణయించారు. దీని ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో నిర్వహించినప్పటికీ టీమిండియా అన్ని మ్యాచ్‌లు యూఏఈలో జరిగాయి. ఇప్పుడు ఆసియా కప్ 2025 ను కూడా అలాగే నిర్వహించవచ్చని తెలుస్తోంది. దీని ప్రకారం పాక్ తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడనుంది. కానీ ఇప్పుడు మ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య రాజీకీయ ఉద్రిక్తలు మరింత పెరిగాయి. దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ పాల్గోంటుందా? ఒక‌వేళ పాల్గోన్న భార‌త్ దాయాది జ‌ట్టుతో ఆడుతుందా అన్న‌ది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ విష‌యాల‌పై మ‌రి కొన్ని రోజుల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు UAE అనే 6 జట్లు పాల్గొంటాయి. అయితే, జూలై మొదటి వారంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోది. అదే సమయంలో టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకటించబడుతుందని కూడా చెబుతున్నారు. ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్ ప్రకారం నిర్వహించారు. ఆ సమయంలో, పాకిస్తాన్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. కానీ భారతదేశం అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది.

ఇంతలో, ఆసియా కప్ 2025 T20i ఫార్మాట్‌లో జరుగుతుంది. మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోరుకున్నప్పటికీ ఈ టోర్నమెంట్‌లో ఆడలేరు. వారిద్దరూ T20i ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..