Asia Cup 2023 IND vs PAK Match Result: రద్దైన మ్యాచ్.. ఇరుజట్లకు ఒక్కో పాయింట్.. సూపర్ 4 చేరిన పాక్

|

Sep 02, 2023 | 10:26 PM

IND vs PAK Match Result: మొదటి ఇన్నింగ్స్ 7:44కి ముగిసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ 8:14కి ప్రారంభించాల్సి ఉంది. మ్యాచ్ కటాఫ్ సమయాన్ని రాత్రి 10:27కి నిర్ణయించారు. అయితే వర్షం ఆగకపోవడంతో 9:50కి మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది.

Asia Cup 2023 IND vs PAK Match Result: రద్దైన మ్యాచ్.. ఇరుజట్లకు ఒక్కో పాయింట్.. సూపర్ 4 చేరిన పాక్
Ind Vs Pak Match Result
Follow us on

Asia cup 2023 IND vs PAK Match Result: ఆసియాకప్‌లో శనివారం జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత జట్టు పాకిస్థాన్‌కు 267 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వర్షంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. దీంతో అంపైర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మొదటి ఇన్నింగ్స్ 7:44కి ముగిసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ 8:14కి ప్రారంభించాల్సి ఉంది. మ్యాచ్ కటాఫ్ సమయాన్ని రాత్రి 10:27కి నిర్ణయించారు. అయితే వర్షం ఆగకపోవడంతో 9:50కి మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో పాకిస్తాన్ టీం సూపర్ 4కు అర్హత సాధించింది. ఆ జట్టు ఖాతాలో 3 పాయింట్లు ఉన్నాయి. టీమిండియా ఖాతాలో ప్రస్తుతం కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది.

పాండ్యా-కిషన్ ధాటికి 266 పరుగులు చేసిన భారత్..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 87, ఇషాన్ కిషన్ 82 పరుగులు చేశారు.

రోహిత్, కోహ్లి, హార్దిక్‌ల వికెట్లు పడగొట్టిన షాహీన్..

టీమిండియా మొత్తం 10 వికెట్లు ఫాస్ట్ బౌలర్లు తీశారు. షాహీన్ షా ఆఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల వికెట్లు షాహీన్ ఖాతాలోకి చేరాయి. హరీస్ రవూఫ్, నసీమ్ షా తలో 3 వికెట్లు తీశారు.

ఇరుజట్ల ప్లేయింగ్ XI

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్.