IND vs NZ: ముగిసిన కివీస్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ 359.. చరిత్ర సృష్టించేనా?

|

Oct 26, 2024 | 11:09 AM

IND vs NZ: పూణె టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 359 పరుగుల టార్గెట్ ఛేదించాల్సి ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు కుప్పకూలింది. అంతకుముందు భారత్‌కు 159 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే.

IND vs NZ: ముగిసిన కివీస్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ 359.. చరిత్ర  సృష్టించేనా?
Ind Vs Nz Test
Follow us on

IND vs NZ: పూణెలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు న్యూజిలాండ్‌ ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ జట్టును భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే పరిమితం చేసింది. ఈ క్రమంలో 359 పరుగుల టార్గెట్‌తో టీమిండియా బరిలోకి దిగింది. భారత్ తరపున తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్‌తో పాటు అశ్విన్ (2 వికెట్లు), జడేజా (3 వికెట్లు) కూడా అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించారు.

భారత్‌కు 359 పరుగుల టార్గెట్..

పూణె మూడో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముందుగా మూడో రోజు టామ్ బ్లండెల్ (41 పరుగులు)ను క్లీన్ బౌల్డ్ చేసి వికెట్లు తీసే ప్రక్రియను జడేజా ప్రారంభించాడు. ఆ తర్వాత అశ్విన్, జడేజా, సుందర్‌ల స్పిన్‌ త్రయం మిగతా బ్యాట్స్‌మెన్‌లను నిలదొక్కుకోనివ్వలేదు. దీంతో న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, భారత్ తరపున వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 156 పరుగులకే ఆలౌట్..

అంతకుముందు మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లు పడగొట్టినప్పటికీ న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. ఆ తర్వాత, న్యూజిలాండ్‌కు చెందిన మిచెల్ సాంట్నర్ స్పిన్ మాయాజాలంతో ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరపున తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా మాత్రమే అత్యధికంగా 38 పరుగులు చేయగలిగాడు. దీంతో టీమిండియా 103 పరుగులకే వెనుదిరిగింది. ఇప్పుడు భారత్ విజయాన్ని నమోదు చేయాలంటే పుణె టర్నింగ్ ట్రాక్‌లో 359 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..