ind vs nz: జైపూర్‎లో పెరిగిన వాయు కాలుష్యం.. భారత్, న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‎ నిర్వహణపై అనుమానం..!

| Edited By: Ravi Kiran

Nov 16, 2021 | 3:50 PM

రాజధాని ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు పక్క నగరాల్లోనూ ప్రభావం చూపుతోంది. పింక్ సిటీ జైపూర్‎లో కాలుష్యం పెరుగుతోంది. దీంతో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈనెల 17న జరగబోయే భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‎పై అనుమానాలు నెలకొన్నాయి.....

ind vs nz: జైపూర్‎లో పెరిగిన వాయు కాలుష్యం.. భారత్, న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‎ నిర్వహణపై అనుమానం..!
Newzealand
Follow us on

రాజధాని ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు పక్క నగరాల్లోనూ ప్రభావం చూపుతోంది. పింక్ సిటీ జైపూర్‎లో కాలుష్యం పెరుగుతోంది. దీంతో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈనెల 17న జరగబోయే భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‎పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇవాళ దుబాయ్ నుంచి జైపూర్ చేరుకోనుంది. జైపూర్ గాలిలో కాలుష్యం స్థాయి పెరిగినట్లు తెలుస్తుంది. జైపూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం గత వారం నుంచి జైపూర్‎లో కాలుష్యం స్థాయి పెరిగింది. ఆదివారం జైపూర్‌లో గాలి అత్యంత దారుణంగా ఉందని, పొగమంచు బాగా ఉందని నివేదిక పేర్కొంది. గాలి యొక్క AQI 337 వద్ద నమోదైంది. ఇది దీపావళి తర్వాత ఇలా జరగడం రెండోసారి. దీపావళి రోజున జైపూర్ ఎయిర్ ఏక్యూఐ 364గా ఉంది.

ఇప్పుడు ఈ వాతావరణంలో న్యూజిలాండ్ జట్టు జైపూర్ చేరుకుంటోంది. అదే సమయంలో భారత జట్టు ఇప్పటికే అక్కడ ఉంది. 2021 టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌ మ్యాచ్ ఆడడం వల్ల జైపూర్ చేరుకోవడం ఆలస్యమైంది. జైపూర్‎కు చేరుకున్న కివీస్ జట్టుకు ఒక్కరోజు అంటే (నవంబర్ 16) ప్రాక్టీస్ సమయం ఉంటుంది. జైపూర్‌లో 8 ఏళ్ల తర్వాత మ్యాచ్ జరగబోతుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో భారత్‌కి ఇది తొలి టీ20. ఇంతకుముందు అతను ఇక్కడ మన జట్టు 13 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 12 వన్డేలు, 1 టెస్ట్ ఉంది. 12 వన్డేల్లో భారత్ 8 గెలిచింది. కాగా ఇక్కడ ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్
భారత పర్యటనలో న్యూజిలాండ్ మూడు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. నవంబర్ 17న జైపూర్‌లో తొలి టీ20 జరిగిన తర్వాత రెండో మ్యాచ్ నవంబర్ 19న రాంచీలో జరగనుంది. మూడో టీ20 కోల్‌కత్తాలో జరగనుంది. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత కివీస్ జట్టు 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా ఆడనుంది. తొలి టెస్టు నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో జరగనుండగా, రెండో టెస్టు డిసెంబర్ 3 నుంచి ముంబైలో జరగనుంది.

Read Also.. T20 World Cup 2021: అండర్-19, టీ20, వన్డే వరల్డ్ కప్ గెలిచిన వారు ముగ్గురున్నారు.. అందులో ఒకరు యువరాజ్ సింగ్.. మిగతా ఇద్దరు ఎవరంటే..