IND vs NZ Final: సూర్య స్కెచ్ అదుర్స్ భయ్యో.. ఫైనల్‌లోనూ మారనున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

IND vs NZ Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అయితే, ట్రోఫీ గెలిచిందుకు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టవద్దనుకుంటున్న భారత జట్టు.. బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ కీలకమార్పులు చేసేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో వలె రెండు మార్పులు చేసేందుకు ప్లాన్ చేశారు.

IND vs NZ Final: సూర్య స్కెచ్ అదుర్స్ భయ్యో.. ఫైనల్‌లోనూ మారనున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
Suryakumar Yadav

Updated on: Mar 07, 2026 | 11:49 AM

IND vs NZ Final: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, భారత కెప్టెన్ సూర్య అనూహ్యంగా బ్యాటింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మ్యాచ్ అనంతరం ఆయన వెల్లడించారు.

సెమీఫైనల్ వంటి కీలక నాకౌట్ పోరులో టీమ్ ఇండియా భిన్నమైన బ్యాటింగ్ వ్యూహంతో బరిలోకి దిగింది. టాప్-3 వరకు అంతా సాధారణంగానే ఉన్నా, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య రావాల్సిన చోట శివమ్ దూబే మైదానంలోకి అడుగుపెట్టాడు. ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో సూర్య ఇంతటి సాహసోపేత నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది. దీనికి సమాధానం ఇప్పుడు దొరికింది. మరి ఫైనల్‌లోనూ ఇదే రిపీట్ అవుతుందా?

సంజూ శాంసన్ సృష్టించిన విధ్వంసం..

స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ తన మెరుపు బ్యాటింగ్‌తో స్టేడియంలో హోరెత్తించాడు. కేవలం కొద్ది సేపట్లోనే 89 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా 18 బంతుల్లో 39 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఈ అగ్రెసివ్ మూమెంటం కొనసాగించాలనే ఉద్దేశంతోనే సూర్య తన స్థానాన్ని త్యాగం చేశారు. అలాగే లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌ను మెయింటైన్ చేయాలని దూబేను ముందు పంపారు.

శివమ్ దూబే మెరుపులు..

ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే, కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇంగ్లాండ్‌పై కేవలం 25 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. ఇందులో 4 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. రన్ అవుట్ అయినప్పటికీ, దూబే తన పనిని సమర్థవంతంగా పూర్తి చేశాడు. సూర్య మాట్లాడుతూ.. “మా జట్టులో టాప్-3 వరకు స్థానాలు స్థిరంగా ఉన్నాయి. అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్‌కు వస్తున్నప్పుడు, అతడిని ఎదుర్కోవడానికి దూబే పర్ఫెక్ట్ మ్యాచ్-అప్ అనిపించింది” అని వివరించారు.

ఫైనల్‌లోనూ రిస్క్ తీసుకుంటారా?

ఇప్పుడు అందరి దృష్టి మార్చి 8న జరిగే ఫైనల్‌పైనే ఉంది. ఒకవేళ న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ లేదా ఈష్ సోధి మధ్య ఓవర్లలో బౌలింగ్‌కు వస్తే, సూర్య మళ్ళీ దూబేను ప్రయోగించే అవకాశం ఉంది. ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఒకే ఒక భారీ ఇన్నింగ్స్ ఆడారు. ఫైనల్ పోరులో సూర్యతో పాటు అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us