IND vs NZ: జైపూర్‌లో చివర ఓవర్‌లో కీలక విజయం సాధించి, రాంచీలో అద్భుతంగా గెలిచి మర మ్యాచ్ ఉండగానే టీ20 సిరీస్‌ను రోహిత్ శర్మ సేన కైవసం చేసుకుంది. ఇక సిరీస్‌లో జరిగే చివరి మ్యాచు కోసం కోల్‌కతాలో బరిలోకి దిగనుంది. టీమిండియా క్లీన్ స్వీప్ చేసేందుకు ఎదురుచూస్తోంది. అయితే చివరి మ్యాచులో న్యూజిలాండ్ ఎదురుదాడి చేసి, గెలవాలని కోరుకుంటుంది. అయితే ఇది జరగకముందే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇరు జట్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్‌ను పరిశీలించిన తర్వాత గంగూలీ ఇలా అన్నాడు. ఏదేమైనా, రెండు జట్లు చివరి టీ20ఐ కోసం కోల్‌కతా చేరుకున్నాయని, నవంబర్ 21న ఆదివారం వారి మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఇప్పటి వరకు టాస్ ఆడిన భారత కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకు అదృష్టం కలిసొచ్చింది. గత రెండు మ్యాచ్‌ల్లో టాస్‌తో పాటు మ్యాచ్‌లోనూ విజయం సాధించాడు. ఇక, ఇప్పుడు కోల్‌కతాలో మరోసారి టాస్‌కి బాస్‌గా అవతరించడం తప్పనిసరి అయింది. కివీస్ జట్టు టాస్‌ను గెలిచేందుకు కూడా చూడొచ్చు. అయితే చివర మ్యాచులో జాగ్రత్తగా ఉండాలని సౌరవ్ గంగూలీ సలహా తర్వాత ఇరుజట్లు ఏలా తీసుకుంటాయో చూడాలి.
మంచుతో జాగ్రత్తగా ఉండాలి: గంగూలీ
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకారం, కోల్‌కతాలో జరిగే మూడవ, చివరి టీ20లో మంచు పెద్ద కారకంగా ఉంటుంది. ఇరు జట్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచు సమస్య కొత్తది కాదు. యాంటీ-డ్యూ స్ప్రేని ఉపయోగించాల్సిన జైపూర్, రాంచీలలో కూడా ఇది జరిగింది. ఇప్పుడు కోల్‌కతాలో కూడా అదే స్ప్రే ఉపయోగించనున్నారు. ఈడెన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ, CAB ప్రెసిడెంట్ అవిషేక్ దాల్మియాతో కలిసి పిచ్‌ను పరిశీలించిన తర్వాత గంగూలీ డ్యూ సమస్యపై దృష్టిని పారించాడు.
సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, “సాధారణంగా ఈడెన్ పిచ్ అంతకుముందు బాగానే ఉంది. అయితే ఈసారి మంచు పెద్ద కారకంగా మారనుంది. అయితే ఇప్పుడు మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం?” మంచు కారణంగా జైపూర్, రాంచీ టీ20ల్లో న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 20-25 పరుగులు అదనంగా స్కోర్ చేయగలిగింది. ఇది మ్యాచ్‌లో నిలవడం వారికి సులభతరం చేసింది.
ఈడెన్‌లో పరుగుల వేటలో టీమిండియా రికార్డు బాగుంది. చివరి రెండు టీ20ల్లో భారత్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కోల్‌కతాలోనూ టాస్ పాత్ర కీలకం కానుంది. మంచుతో పాటు ఈడెన్ గార్డెన్స్ ఛేదినలో జట్టుకు అనుకూలంగా ఉండనుంది. ఛేజింగ్‌లో భాగంగా ఇక్కడ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచాయి. కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Also Read: IPL 2022: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ అందించిన బీసీసీఐ సెక్రటరీ.. ఐపీఎల్ 2022 ఎక్కడ జరగనుందంటే?
IPL 2022: కీలక ప్రకటన చేసిన ధోని.. ఐపీఎల్ 2022లో ఆడడంపై ఏమన్నాడంటే?