IND vs NZ: 9 ఫోర్లు, 6 సిక్సర్లతో రోహిత్ బీభత్సం.. ఇండోర్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ విధ్వంసం.. కివీస్ బౌలర్లకు బడితపూజే.?

Rohit Sharma batting performance against NZ in Indore: రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడమే కాకుండా, సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఆదివారం హోల్కర్ స్టేడియంలో 'రో-హిట్' షో మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో వేచి చూడాలి!

IND vs NZ: 9 ఫోర్లు, 6 సిక్సర్లతో రోహిత్ బీభత్సం.. ఇండోర్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ విధ్వంసం.. కివీస్ బౌలర్లకు బడితపూజే.?
Ind Vs Nz Rohit Sharma

Updated on: Jan 16, 2026 | 9:18 PM

Rohit Sharma Indore Record: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి పోరు జనవరి 18, ఆదివారం నాడు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో అందరి కళ్లు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పెద్ద స్కోర్లు చేయలేకపోయిన రోహిత్, ఇండోర్ గడ్డపై మాత్రం తన విశ్వరూపం చూపిస్తాడని గణాంకాలు చెబుతున్నాయి.

హోల్కర్‌లో హిట్‌మ్యాన్ హవా..

ఇండోర్ స్టేడియం అంటే రోహిత్ శర్మకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం, పైగా బౌండరీలు చిన్నవిగా ఉండటం రోహిత్ లాంటి పవర్ హిట్టర్‌కు కలిసిచ్చే అంశం. గతంలో న్యూజిలాండ్ ఇక్కడ ఆడినప్పుడు రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఆ పాత జ్ఞాపకాలు..

జనవరి 24, 2023న ఇదే వేదికపై న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 85 బంతుల్లోనే 101 పరుగులతో అద్భుత సెంచరీ బాదాడు. ఆ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన రోహిత్, తర్వాతి 42 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (112) కూడా రాణించడంతో భారత్ 385 పరుగుల భారీ స్కోరు చేసి, 90 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత ఫామ్ ఎలా ఉంది?

ప్రస్తుత సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన కొంచెం నిలకడగా ఉన్నప్పటికీ, భారీ ఇన్నింగ్స్‌లు రాలేదు. మొదటి రెండు వన్డేల్లో 26, 24 పరుగులు చేసి మంచి ఆరంభాలను పొందినప్పటికీ, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. అయితే, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 3లో ఉన్న రోహిత్ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

తన చివరి 7 అంతర్జాతీయ వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు.

ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ (2025-26)లో సిక్కింపై 155 పరుగులతో వీరవిహారం చేశాడు.

కివీస్ బౌలర్లకు సవాలే..

నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్ ఫామ్‌లోకి వస్తే కివీస్ బౌలర్లను ఆపడం ఎవరి తరమూ కాదు. పవర్ ప్లేలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే రోహిత్, ఇండోర్ చిన్న మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తన ఫేవరెట్ స్టేడియంలో మరో సెంచరీతో భారత్‌కు సిరీస్ అందించాలని రోహిత్ పట్టుదలతో ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..