IND vs NAM, T20 World Cup 2021: దుబాయ్ వేదికగా నమీబియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాలాంటి బలమైన జట్టుపై నమీబియా పర్వాలేదనిపించింది. నీర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి మంచి లక్ష్యాన్నే భారత్ ముందు ఉంచింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్‌కి దిగిన నమీబియా బ్యాట్స్‌మెన్ మొదట్లో ఆచితూచి ఆడారు. జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే అనంతరం వరుస వికెట్లు పడ్డాయి. ఒకవేళ ఓపెనర్లు అలాగే స్టాండింగ్ ఇస్తే స్కోరు మరింత పెరిగి ఉండేది.
అయితే బుమ్రా బౌలింగ్ లింజెన్ అవుట్ కావడంతో నమీబియా స్కోరుకు బ్రేకులు పడ్డాయి. తదనంతరం వరుస వికెట్లు కోల్పోయింది. విలియమ్స్, స్టీఫెన్ బైర్డ్, నికోల్, జేన్ గ్రీన్, స్టీఫెన్ బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్ బాటపట్టారు. నమీబియా బ్యాట్స్‌మెన్‌లో స్టీఫెన్ (21), డేవిడ్ (26 ) అత్యధికంగా పరుగులు సాధించారు. నమీబియా బ్యాట్స్‌మెన్ తమ స్థాయిలో ఆడడంతో టీమిండియాకు మంచి లక్ష్యాన్ని ఇవ్వగలిగారు.
ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చేరో మూడో వికెట్లు తీసుకొని నమీబియాను నిలువరించారు. అలాగే బుమ్రా రెండు వికెట్లను పడగొట్టాడు. ఇక టీమిండియా టోర్నీలో ఆడుతోన్న చివరి మ్యాచ్‌లో గెలవాలంటే 133 పరుగులు చేయాల్సి ఉంది.
Also Read: Diwali 2021: దీపావళి వేడుకలో పీవీ సింధు డ్యాన్స్.. వైరల్ అయిన వీడియో..
T20 World Cup 2021: పాకిస్తాన్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన వసీం జాఫర్.. 12-1లో అర్థం ఏమిటంటే..