సెహ్వాగ్ 2.0 దొరికేశాడు.. క్రీజులోకి దిగితే బుల్డోజరే.. దెబ్బకు ఇంగ్లీష్ ప్లేయర్స్‌ను సుస్సుపోయించాడు!

|

Feb 17, 2024 | 7:13 PM

ఇంగ్లాండ్‌ జట్టుకు తమ సొంత మెడిసిన్‌ను రుచి చూపించింది టీమిండియా. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అయితే.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వరకు నిదానంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్..

సెహ్వాగ్ 2.0 దొరికేశాడు.. క్రీజులోకి దిగితే బుల్డోజరే.. దెబ్బకు ఇంగ్లీష్ ప్లేయర్స్‌ను సుస్సుపోయించాడు!
Team India
Follow us on

ఇంగ్లాండ్‌ జట్టుకు తమ సొంత మెడిసిన్‌ను రుచి చూపించింది టీమిండియా. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అయితే.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వరకు నిదానంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్.. ఆ తర్వాత పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. 35 పరుగులకు 73 బంతులు తీసుకున్న జైస్వాల్.. ఆ తర్వాత 7 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ అండర్సన్ బౌలింగ్‌ వేసిన 27వ ఓవర్‌లో చివరి మూడు బంతులు 6, 4, 4 బాదేసి.. జైస్వాల్ తన గేర్ మార్చాడు. అనంతరం మరో రెండు ఓవర్లలోనూ 6, 6, 6 బాది.. ఇంగ్లాండ్‌కు తన సొంత మెడిసిన్ బజ్‌బాల్ రుచి చూపించాడు.

122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్.. మొత్తంగా 133 బంతులు ఎదుర్కుని 104 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో జైస్వాల్.. ఒక హాఫ్ సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటిదాకా ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ కూడా జైస్వాలే. 400కి పైగా పరుగులు చేశాడు యశ్వసి జైస్వాల్.

కాగా, టెస్టుల్లో వేగంగా మూడు సెంచరీలు సాధించిన ఏడో ఆటగాడిగా యశ్వసి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. 13 ఇన్నింగ్స్‌లలో జైస్వాల్ ఈ ఘనత సాధించగా.. అతడు ఈ ఫీట్‌తో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్‌ సరసన చేరాడు. ఇందులోనూ సెహ్వాగ్ కంటే మెరుగైన సగటు, స్ట్రైక్ రేటుతో జైస్వాల్ ఈ రికార్డు సాధించడం గమనార్హం. సెహ్వాగ్ 13 ఇన్నింగ్స్‌ల్లో 53 సగటుతో 66 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధిస్తే.. జైస్వాల్ 62 సగటుతో 65 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు.