IND vs ENG: నాటింగ్‌హామ్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. షమి వేసిన 85.5 ఓవర్‌కు రాబిన్‌సన్(15) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు.. సిరాజ్, శార్ధూల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా షమి ఒక వికెట్ తీశాడు. జో రూట్ (109) శతకంతో చెలరేగాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లు పడగొట్టారు.
INNINGS BREAK!
England all out for 303.
5⃣ wickets for @Jaspritbumrah93
2⃣ wickets each for @mdsirajofficial & @imShard
1⃣ wicket for @MdShami11109 for Joe Root#TeamIndia need 209 runs to win. #ENGvIND
Scorecard ? https://t.co/TrX6JMzP9A pic.twitter.com/oTSY6GhRZI
— BCCI (@BCCI) August 7, 2021
Also Read: Neeraj Chopra: ఒకప్పుడు ఊబకాయుడు.. ఇప్పుడు వండర్ క్రియేట్ చేసిన వీరుడు.. జయహో నీరజ్
Neeraj Chopra: దేశం నిన్ను చూసి గర్విస్తోంది.. నీరజ్ అద్భుత విజయంపై ప్రముఖులు ఎలా స్పందించారంటే.