Virat kohli: ఓవల్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌.. సచిన్‌ రికార్డును బ్రేక్ చేసిన భారత కెప్టెన్.. ఎందులోనో తెలుసా?

|

Sep 02, 2021 | 10:27 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అంతర్జాతీయంగా 23000 పరుగులు పూర్తి చేశాడు.

Virat kohli: ఓవల్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌.. సచిన్‌ రికార్డును బ్రేక్ చేసిన భారత కెప్టెన్.. ఎందులోనో తెలుసా?
Virat Kohli
Follow us on

IND vs ENG: టెస్ట్ క్రికెట్‌లో గత కొతం కాలంగా చెప్పుకోదగ్గ పెద్ద స్కోర్లు సాధించలేకపోయినప్పటికీ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని రికార్డు పుస్తకాలకు దూరంగా ఉంచడం చాలా కష్టం. కోహ్లీ గురువారం అత్యంత వేగంగా 23000 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. భారత కెప్టెన్ ది ఓవల్‌లో ఇండియా-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లోనే ఓ అద్భుతమైన డ్రైవ్‌తో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్‌లలో 23000 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. కాగా, సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ రికార్డును చాలా తేలికగా బద్దలు కొట్టాడు. సచిన్ 522 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 544 ఇన్నింగ్స్‌లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కాలిస్ 551 ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో నిలిచింది.

కోహ్లీ, సచిన్ తరువాత 23000 అంతర్జాతీయ పరుగులు సాధించిన మరో భారతీయుడిగా రాహుల్ ద్రవిడ్ నిలిచాడు. భారత మాజీ కెప్టెన్ ద్రవిడ్ 576 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (34357 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (24208 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ.. మూడవ స్థానంలో నిలిచాడు.

టీమిండియా కెప్టెన్ 32 ఏళ్ల విరాట్.. మూడు ఫార్మాట్లలో 50 కి పైగా సగటుతో పరుగులు సాధించాడు. 96 టెస్టుల్లో కోహ్లీ 13,646 పరుగులు సాధించాడు. 254 వన్డేల్లో 13,061 పరుగులు పూర్తి చేశాడు. అలాగే 89 టీ 20 ఇంటర్నేషనల్స్‌లో 2272 పరుగులు సాధించాడు.

మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. బౌండరీలతో కొద్దిసేపు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన శార్దుల్ ఠాకూర్ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శార్దుల్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్‌సన్ 3, అండర్ సన్, క్రిగ్ తలో వికెట్ పడగొట్టారు.

Also Read: విహారి సెంచరీ.. బుమ్రా హ్యాట్రిక్.. 257 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన భారత్.. ఏ టీంపైనో తెలుసా?

Viral Video: పోలా.. అదిరిపోలా.. మనోడి అద్భుతమైన క్యాచ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Virat Kohli – Rohit Sharma: కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి