Bumrah World Record: లారా రికార్డ్‌ను బద్దలు కొట్టిన బుమ్రా.. ఒక్క ఓవర్‌లో ఎన్ని రన్స్ కొట్టాడంటే? వీడియో

|

Jul 02, 2022 | 4:44 PM

అతను ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు రాబట్టి, సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. వెస్టిండీస్ గొప్ప బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు.

Bumrah World Record: లారా రికార్డ్‌ను బద్దలు కొట్టిన బుమ్రా.. ఒక్క ఓవర్‌లో ఎన్ని రన్స్ కొట్టాడంటే? వీడియో
Jasprit Bumrah
Follow us on

టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్ జట్టు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రపంచ రికార్డు సృష్టించాడు. బుమ్రా ఈ రికార్డును బంతితో కాకుండా బ్యాట్‌తో చేయడం విశేషం. అతను ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు రాబట్టి, సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. వెస్టిండీస్ గొప్ప బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ రెండో రోజున, బుమ్రా వెటరన్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ను చితక్కొట్టాడు. తన ఒక్క ఓవర్‌లో29 పరుగులు పిండుకుని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. మొత్తంగా బ్రాడ్ ఆ ఓవర్‌లో 35 పరుగులు ఇచ్చాడు. ఈ విధంగా 18 ఏళ్ల క్రితం లారా నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. లారా 2004లో ఒక ఓవర్‌లో 28 పరుగులు రాబట్టుకుని, ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఆ తర్వాత రెండుసార్లు అది పునరావృతమైంది. కానీ, నేడు బుమ్రా ఏకంగా ఈ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

ఇన్నింగ్స్ 84వ ఓవర్ వేసిన బ్రాడ్.. ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. ఇది ఓ ప్రపంచ రికార్డుగా మారింది. ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌లో ఇన్ని పరుగులు రాకపోవడం విశేషం. ఇంగ్లండ్ తరపున జేమ్స్ అండర్సన్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. తన పేరిట 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు..

35 జస్ప్రీత్ బుమ్రా (స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) బర్మింగ్‌హామ్ 2022

28 బ్రియన్ లారా (R పీటర్సన్) జోహన్నెస్‌బర్గ్ 2003

28 G బెయిలీ ఆఫ్ (J ఆండర్సన్) పెర్త్ 2013

28 K మహారాజ్ (J రూట్) పోర్ట్ ఎలిజబెత్ 2020

28 షాహీద్ అఫ్రిది (హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో)