నేడు బిగ్ ఫైట్ జరగబోతుంది. పాక్‌తో టీ20 ఫైనల్ ఆడేది మనమో లేక ఇంగ్లాండ్ అనేది నేటి సెమీ ఫైనల్ మ్యాచ్‌తో తేలిపోతుంది. పాత రికార్డ్స్ తిరగేస్తే.. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, ఇంగ్లాండ్ 3 సార్లు ఎదురెదురు నిలిచాయి. 2007, 2012 వరల్డ్ కప్స్‌లో భారత్ విజయాలు వరించగా.. 2009లో ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. హాట్ ఫేవరెట్‌గా ఇంగ్లాండ్ 2022 వరల్డ్ కప్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం ప్రదర్శన లేదనే చెప్పాలి. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. శ్రీలంక చేతిలో కూడా పరాజయం అంచుకు పోయి చివరికి ఎలాగోలా గెలిచింది. అలాగని అస్సలు తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జట్టు ధృడంగా ఉంది. ముఖ్యంగా జట్టును ఆదుకునే లెక్కకు మించిన ఆల్‌రౌండర్లు ఉన్నారు.
ఇండియా ఫైనల్ ఎలెవన్ జట్టు కూర్పు మనవాళ్లకు చాలా ఇబ్బందికరంగా మారింది. దినేశ్ కార్తీక్ అనుకున్న స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం లేదు. దీంతో గత మ్యాచ్‌కు పంత్‌ను తీసుకున్నారు. కానీ అతడు కూడా నిరాశపరిచాడు. అయితే ఒక్క మ్యాచ్ ద్వారా అతడి ఫామ్ డిసైడ్ చేయలేం. సెకండ్ స్పిన్నర్‌గా భావిస్తున్న అక్షర్ పటేల్ పెద్దగా ప్రదర్శన చూపడం లేదు. అతడి స్థానంలో ఓ బ్యాట్స్‌మన్‌ను తీసుకోవడం మంచిదనే అభిప్రాయాలు ఉన్నాయి. పంత్, కార్తీక్‌లిద్దరినీ ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్‌కూ తీసుకుంటారని అంచనాలు ఉన్నాయి. పిచ్ తీరును బట్టి ఈ నిర్ణయం ఉంటుంది. ఒకవేళ పేస్‌కు అనుకూలంగా పిచ్ ఉంటే.. హర్షల్ పటేల్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ పరంగా కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్.. మెరుపులు మెరిపిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ ఒక్కడు ఫామ్‌లోకి వస్తే సరిపోతుంది. భువి, అర్ష్‌దీప్, షమి బౌలింగ్ విభాగంలో బాగా రాణిస్తున్నారు.
బట్లర్, స్టోక్స్, హేల్స్, మలన్, మొయిన్ అలీ, బ్రూక్, లివింగ్‌స్టోన్ ఇలా పేర్లు చెబుతుంటేనే వారి బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో తెలుస్తుందో. 8, 9 స్థానాల్లో ఆడే సామ్ కరన్, వోక్స్ సైతం తమదైన రోజున భారీ షాట్లతో విరుచుకుపడతారు. అయితే ప్రజంట్ బట్లర్ తప్పితే ఎవరూ పెద్దగా రాణించడం లేదు. వీరిలో ఎవరైనా ఇద్దరు నిలబడితే చాలు.. మన ఆశలు గల్లంతే. బౌలింగ్‌లో ఇంగ్లాండ్ జట్టు కాస్త వీక్‌గా ఉంది.
రోహిత్ (కెప్టెన్), సూర్యకుమార్, రాహుల్, కోహ్లి, హార్దిక్, పంత్, దినేశ్ కార్తీక్/అక్షర్ పటేల్, అశ్విన్, షమి, అర్ష్‌దీప్, భువనేశ్వర్
బట్లర్ (కెప్టెన్), హేల్స్, స్టోక్స్,లివింగ్‌స్టోన్, మలన్/సాల్ట్, రషీద్, బ్రూక్, మొయిన్ అలీ, వోక్స్, సామ్ కరన్, వుడ్/జోర్డాన్
సెమీఫైనల్ డే వచ్చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ అయిన అడిలైడ్‌లో రాత్రంతా వర్షం పడింది. ప్రస్తుతం మేఘావృతమై ఉంది.శుభవార్త ఏమిటంటే, ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ సూచన స్పష్టంగా చెబుతోంది.
Rained all night. Cloudy morning in Adelaide #IndvsEng
— Vikrant Gupta (@vikrantgupta73) November 9, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..