IND vs ENG: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ని విజయ తీరాలకు చేర్చిన కెప్టెన్ జో రూట్.. ఓవల్‌లో భారతదేశంపై మరోసారి ఎదురుదాడి చేసేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని తెలిపాడు. నాల్గవ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య జరగనుంది. ఈ పరీక్షలో రవిచంద్రన్ అశ్విన్‌ను భారత జట్టులో చేర్చనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి మూడు టెస్టుల్లో అశ్విన్‌కు బదులుగా కోహ్లీ.. రవీంద్ర జడేజాను తీసుకున్నాడు. కానీ, ఓవల్ టెస్టులో మాత్రం ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ను రంగంలోకి దించాలనే డిమాండ్ పెరుగుతోంది. హర్భజన్ సింగ్ కంటే నాలుగు వికెట్లు వెనుక, అనిల్ కుంబ్లే తర్వాత భారతదేశంలో రెండవ విజయవంతమైన టెస్ట్ స్పిన్నర్‌గా ఎదిగిన అశ్విన్.. గత నెలలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రేతో ఆడాడు. ఇదే మైదానంలో ఆడిన అశ్విన్ ఒక మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీశాడు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత అత్యుత్తమ బౌలర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
లార్డ్స్ టెస్టులో విజయం సాధించిన తర్వాత ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి చేరుకుంది. అయితే ఇంగ్లండ్ మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. నాల్గవ టెస్టుకు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ, ‘విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా బలమైన పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మేము సిరీస్‌ను సమం చేశాం. అశ్విన్ ప్రపంచ స్థాయి ఆటగాడు. ఇంగ్లండ్‌పై పరుగులు, వికెట్లు తీయడం చూశాం. అతను టెస్ట్ క్రికెట్‌లో ఏమి చేయగలడో మాకు తెలుసు. ప్రతీ సవాలును ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారత్ ఎలాంటి ప్లేయర్లతో వచ్చినా మేం ఎదర్కోగలం’ అని తెలిపారు.
కోహ్లీ ప్రశాంతంగా ఉంటేనే బెటర్..
కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. ఇందుకు రూట్ ఇంగ్లండ్ బౌలర్లకు క్రెడిట్ అందించాడు. ‘ఈ ఘనత మా బౌలర్లకు మాత్రమే చెందుతుంది. సిరీస్ గెలవాలంటే, కోహ్లీ మౌనంగా ఉండాల్సిందే. కోహ్లిని పెవిలియన్ పంపందుకు మేము ఒక ప్లాన్ చేశాం. దాంతోనే మేం టీమిండియాపై ఒత్తిడి పెంచుతున్నాం. రాబోయే మ్యాచులో కోహ్లీ సేనపై మరింత ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తాం. వారిని పరుగులు చేయకుండా అడ్డుకోగలం. నిరంతరం టీమిండియాపై ఒత్తిడిని కొనసాగించడం ద్వారానే మేం ముందుకు సాగుతాం. సిరీస్‌లో మేం బలంగా తిరిగి పుంజుకున్నాం. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నాం. సిరీస్‌ను సమం చేయడానికి మేం చాలా కష్టపడ్డాం’ అంటూ వెల్లడించారు.
ఇంగ్లండ్ కెప్టెన్ తన జట్టు ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా భారత్‌తో ఆడుతుందని తెలపాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారతదేశం ప్రపంచ స్థాయి జట్టుగా ఎదిగిందని తెలిపారు. మేం టీమిండియా నుంచి ఎదురుదాడిని ఆశిస్తున్నాం. రాబోయే మ్యాచులో అలసిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం సిరీస్‌ను సమం చేశాం. అలాగే రాబోయే మ్యాచులను గెలచి, సిరీస్‌ను గెలిచేందుకు ప్రయత్నిస్తాం అని పేర్కొన్నాడు.
Also Read:
Worst Record: 20 ఓవర్ల మ్యాచ్.. 14 బంతుల్లో ఫలితం.. వరుసగా చెత్త రికార్డులు ఆ జట్టు సొంతం!
IPL 2021: రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద దెబ్బ.. దూరమైన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. కొత్తగా ఎవరొచ్చారంటే..!