IND vs ENG: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో లేని కింగ్ కోహ్లీ, పంత్.. ఆ యంగ్ ప్లేయర్ల ఎంట్రీ

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంద. విదర్భ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే ఈ వన్డే సిరీస్ తర్వాత ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

IND vs ENG: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో లేని కింగ్ కోహ్లీ, పంత్.. ఆ యంగ్ ప్లేయర్ల ఎంట్రీ
India Vs England

Updated on: Feb 06, 2025 | 1:34 PM

నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫీల్డింగ్ కు రానుంది. కాగా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా కింగ్ కోహ్లీ మ్యాచ్ కు దూరమయ్యాడు. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా అనుభవజ్ఞుడైన బ్యాటkh విరాట్ కోహ్లీ ఆడడు. మోకాలి గాయం కారణంగా విరాట్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టాస్ సమయంలో రోహిత్ శర్మ ఈ విషయం చెప్పాడు. అలాగే, ప్రముఖ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. అందువల్ల, విరాట్,  బుమ్రా స్థానంలో ఇద్దరు యువ ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా ఇద్దరూ అరంగేట్రం చేశారు. విరాట్ స్థానంలో యస్వీకి జట్టులో అవకాశం లభించింది. కాబట్టి బుమ్రా స్థానంలో హర్షిత్ ఆడతాడు. బుమ్రాకు బ్యాకప్ ఆటగాడిగా హర్షిత్ జట్టులోకి వచ్చాడు.

ముగ్గురు ముంబై నుంచే..

యశస్వి అరంగేట్రం కారణంగా టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ముంబై ఆధిపత్యం కనిపిస్తోంది. ముగ్గురు ముంబై ఇండియన్స్ – కెప్టెన్ రోహిత్, శ్రేయాస్ అయ్యర్,  యశస్వి జైస్వాల్   టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:

బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్.

అరంగేట్ర ఆటగాళ్లకు క్యాప్ ఇస్తోన్న రోహిత్ శర్మ, మహ్మద్  షమీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..