IND VS ENG: శ్రేయస్‌ బలహీనతపై దెబ్బకొట్టిన మెక్‌కల్లమ్‌.. తెలివిగా ఎలా బుట్టలో పడేశారో మీరే చూడండి..

Shreyas Iyer: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో టీమిండిమా మిడిలార్డర్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) మరోసారి నిరాశపర్చాడు. తొలి ఇన్నింగ్స్‌ లో కేవలం 15 పరుగులు చేసి ఔటైన అతను.. రెండో ఇన్నింగ్స్‌ లోనూ 19 పరుగులకే పెవిలియన్‌ చేరుకున్నాడు.

IND VS ENG: శ్రేయస్‌ బలహీనతపై దెబ్బకొట్టిన మెక్‌కల్లమ్‌.. తెలివిగా ఎలా బుట్టలో పడేశారో మీరే చూడండి..
Shreyas Iyer

Updated on: Jul 05, 2022 | 11:28 AM

Shreyas Iyer: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో టీమిండిమా మిడిలార్డర్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) మరోసారి నిరాశపర్చాడు. తొలి ఇన్నింగ్స్‌ లో కేవలం 15 పరుగులు చేసి ఔటైన అతను.. రెండో ఇన్నింగ్స్‌ లోనూ 19 పరుగులకే పెవిలియన్‌ చేరుకున్నాడు. ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయమేమిటంటే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అతను షార్ట్‌పిచ్‌ బాల్‌కే వెనుదిరిగడం గమనార్హం. మొదటి ఇన్నింగ్స్ లో మంచి షార్ట్‌ పిచ్‌ బంతితో అండర్సన్ బోల్తా కొట్టిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో అదే టెక్నిక్‌తో పాట్స్‌ శ్రేయస్‌ను ఔట్‌ చేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్ బలహీనతపై దెబ్బకొట్టాలని ఇంగ్లండ్ బౌలర్లకు ఆ జట్టు కోచ్ మెక్‌కల్లమ్ Mccullum సైగలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేకేఆర్ హెడ్ కోచ్‌గా మెక్‌కల్లమ్‌కు శ్రేయస్‌ బలహీనతలు బాగా తెలుసు. ఈ క్రమంలోనే అతను క్రీజులో నిలదొక్కుకోకుండా డగౌట్‌ నుంచే తమ బౌలర్లకు సైగలతో పలు సూచనలు చేశాడు.

కోచ్‌ సూచనలను చక్కగా ఫాలో అయిన ఇంగ్లండ్‌ బౌలర్లు శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో పడేశారు. ఇందులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో అతను ఎదుర్కొన్న 26 బంతుల్లో 19 బంతుల్ని షార్ట్‌పిచ్‌గానే సంధించారు. దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్‌ బౌలర్ల ట్రాప్‌లో పడిపోయిన శ్రేయస్‌ అనవసరంగా టెంప్ట్‌ అయ్యాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 119 రన్స్‌ అవసరం. జోరూట్‌ (76), బెయిర్‌స్టో (72) క్రీజులో ఉన్నారు. మరోవైపు భారత జట్టు విజయం సాధించాలంటే ఏడు వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..