IND vs ENG: భారత్, ఇంగ్లండ్ టీంలమధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నేటి (బుధవారం, ఆగస్టు 4) నుంచి ప్రారంభం కానుంది. రెండు జట్లు మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ సిరీస్ రెండవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్‌తోనే రెండవ డబ్ల్యూటీసీ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో 60 పాయింట్లు కేటాయించారు. నేటి మధ్యాహ్నం నుంచి జరగబోయే ఈ మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడవచ్చో తెలుసుకుందాం.
గాయపడిన ఆటగాళ్లతో ఇబ్బంది పడుతున్న భారత జట్టు, రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అదే సమయంలో, మ్యాచ్‌కు రెండు రోజుల ముందు పిచ్‌లో ఆకుపచ్చ గడ్డి కనిపించింది. దీంతో భారత్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఆడనుంది. ఇది ఆటీంకి కొంత ప్రతికూలంగా మారనుంది.
5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
మొదటి టెస్ట్ మ్యాచ్: ఆగస్టు 4 నుంచి 8 వరకు నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతుంది.
రెండో టెస్ట్: ఆగస్టు 12 నుంచి 16 వరకు లండన్‌లో జరుగుతుంది.
మూడో టెస్ట్: ఆగస్టు 25 నుంచి 29 వరకు మ్యాచ్ హెడింగ్లీలో జరుగుతుంది.
నాలుగో టెస్ట్: సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్‌లో జరుగుతుంది.
ఐదవ టెస్ట్: మ్యాచ్ మాంచెస్టర్‌లో సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు జరుగుతుంది.
తొలి టెస్టు మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడతారు?
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ఆగస్టు 4, బుధవారం నుంచి నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో మొదలుకానుంది.
మ్యాచ్ సమయం?
భారత కాలమానం ప్రకారం, ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు టాస్ వేయనున్నారు.
మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
తొలి టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో పలు భాషలలో చూడవచ్చు. అలాగే సోనీ లైవ్ యాప్, జియో టీవీలో చూడవచ్చు.
భారత ప్లేయింగ్ ఎలెవన్ జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజరా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవి చంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Also Read: చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ టీంలకు గుడ్ న్యూస్.. రంగంలోకి స్టార్ ప్లేయర్లు.. ఇక ఫ్యాన్స్‌కి పండగే
IND vs ENG: రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరు..? టీమిండియాను వేధిస్తోన్న కొత్త సమస్య
కొత్త హెయిర్ స్టైల్‌తో ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ.. బాలీవుడ్ తారలతో కలిసి సందడి చేసిన మిస్టర్ కూల్