IND vs BAN Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అందరి చూపు ఐపీఎల్ సెన్సెషన్‌పైనే..

|

Dec 08, 2024 | 10:39 AM

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ అండర్-19 ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా నెమ్మదిగా మొదలుపెట్టి.. ఆ తర్వాత పునరాగమనం చేసింది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన భారత జట్టు పుంజుకుని ప్రతి మ్యాచ్‌లో వరుసగా విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది.

IND vs BAN Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అందరి చూపు ఐపీఎల్ సెన్సెషన్‌పైనే..
Ind Vs Ban U19 Final
Follow us on

అండర్-19 ఆసియా కప్‌లో కొత్త ఛాంపియన్ ఎవరనేది ఈరోజు ఖరారు కానుంది. ఈరోజు దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతోంది. గతేడాది బంగ్లా టీం టైటిల్‌ను గెలుచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహ్మద్ అమన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సెమీస్‌లో శ్రీలంకను ఓడించి టీమిండియా ఫైనల్‌కు చేరుకోగా, పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ టైటిల్ మ్యాచ్‌లోకి ప్రవేశించింది.

ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడితే, రెండు జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీ-ఫైనల్స్‌లో తమ తమ జట్లను విజయానికి నడిపించిన అదే ఆటగాళ్లపై విశ్వాసం వ్యక్తం చేశాయి. రెండు జట్లూ చాలా బలమైన జట్లేనని, వాటిలో ఎలాంటి బలహీనత లేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

భారత్: మహ్మద్ అమన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే, ఆండ్రీ సిద్ధార్థ్, కేపీ కార్తికేయ, నిఖిల్ కుమార్, హర్వాన్ష్ పంగాలియా, హార్దిక్ రాజ్, కిరణ్ చోర్మలే, చేతన్ శర్మ, యుధ్జిత్ గుహ.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌: అజీజుల్‌ హకీమ్‌ (కెప్టెన్‌), జవాద్‌ అబ్రార్‌, కలాం సిద్ధిఖీ, మహ్మద్‌ షిహాబ్‌ జేమ్స్‌, రిజాన్‌ హొసన్‌, ఫరీద్‌ హసన్‌, దేబాశిష్‌ దేబా, ఇక్బాల్‌ హొస్సేన్‌ ఎమోన్‌, మరూఫ్‌ మృధా, సమియున్‌ బషీర్‌, అల్‌ ఫహద్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..