IND vs BAN: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో ఓటమి తర్వాత, భారత జట్టు వచ్చే ఏడాది ODI ప్రపంచ కప్‌కు తిరిగి సిద్ధమవుతోంది. అయితే ఆ లక్ష్యం దిశగా టీమ్ ఇండియా ప్రయాణం ఆరంభంలో బెడిసికొట్టింది. డిసెంబర్ 7న, బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ODI సిరీస్‌లో తిరుగులేని 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ తరపున మెహదీ హసన్ మిరాజ్ చిరస్మరణీయమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌కు 272 పరుగుల లక్ష్యాన్ని అందించాడు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసిన టీమిండియా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. అదే సమయంలో టీమిండియా ప్రదర్శన నిరంతరం దారుణంగా పడిపోవడంతో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు కురిపించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ఫన్నీ ట్వీట్‌తో చమత్కరించాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమి తర్వాత, భారత ప్రస్తుత ప్రదర్శనపై వీరేంద్ర సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు. టీమిండియా మాజీ తుఫాన్ బ్యాట్స్‌మెన్ ట్వీట్ చేసి, భారత ప్రదర్శనను క్రిప్టో కరెన్నీతో పోల్చాడు. టీమిండియా ప్రదర్శన క్రిప్టో కరెన్సీ కంటే దారుణంగా, వేగంగా దిగజారిపోతుంది. ఇప్పుడు మేల్కొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదంటే, మరిన్ని పరాజయాలు చవి చూడాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు.
Cryptos se bhi tez gir rahi hai apni performance yaar. Need to shake up – wake up.
— Virender Sehwag (@virendersehwag) December 7, 2022
ఇక రెండో మ్యాచ్ గురించి చెప్పాలంటే చివరి బంతికి భారత్ విజయానికి 6 పరుగులు కావాలి. కానీ స్ట్రయిక్‌లో ఉన్న రోహిత్ శర్మను ముస్తాఫిజుర్ రెహ్మాన్ సరైన యార్కర్‌తో ఇబ్బంది పెట్టాడు. ఆ బంతిని సిక్సర్ కొట్టడంలో హిట్‌మన్ విఫలమయ్యాడు. దీంతో రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ గడ్డపై వన్డే సిరీస్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు 2015లో ఎంఎస్ ధోని సారథ్యంలోని బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో 2-1 తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో, ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌తో తన గడ్డపై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడంలో భారత్ మరోసారి విఫలమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..