IND vs AUS: కేరళలో భారీ వర్షాలు.. భారత్‌వర్సెస్ ఆసీస్‌ రెండో టీ20పై ఎఫెక్ట్‌.. ఆదివారం వెదర్ రిపోర్ట్

|

Nov 25, 2023 | 12:28 PM

ఆదివారం (నవంబర్‌ 26) తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇందు కోసం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. తిరువనంతపురంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

IND vs AUS: కేరళలో భారీ వర్షాలు.. భారత్‌వర్సెస్ ఆసీస్‌ రెండో టీ20పై ఎఫెక్ట్‌.. ఆదివారం వెదర్ రిపోర్ట్
India Vs Australia
Follow us on

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించిన భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. జోష్ ఇంగ్లిస్ అద్భుత సెంచరీతో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 208/3 స్కోరు చేసింది. ఆపై సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 80 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. ఇక ఇప్పుడు రెండో టీ20 కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఆదివారం (నవంబర్‌ 26) తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఇందు కోసం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. తిరువనంతపురంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్యూవెదర్ ప్రకారం, నవంబర్ 26న తిరువనంతపురంలో 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇక గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వికెట్‌ చాలా స్లోగా ఉంటుంది. గతంలో ఇక్కడ జరిగిన నాలుగు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఈ పిచ్‌ పై సగటు స్కోరు 114. పిచ్ బౌలర్లకు, ముఖ్యంగా స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి పిచ్‌లోని తేమ ఫాస్ట్ బౌలర్లకు కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా బౌలర్లకు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌లోని గణాంకాలను పరిశీలిస్తే, టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. భారత్ vs ఆస్ట్రేలియా రెండో T20 మ్యాచ్ జియో సినిమా యాప్ లేదా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక Sports18 నెట్‌వర్క్ టీవీ ఛానెల్‌లోనూ ఈ మ్యాచ్‌ లైవ్‌ చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

త్రివేండ్రలో టీమిండియా క్రికెటర్లు..

టీమ్ ఇండియా:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ , ప్రదీప్‌ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆస్ట్రేలియా జట్టు:

ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్/కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్ ఆరోన్ హార్డీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..