IND vs AUS: 19 బంతులు.. 263 స్ట్రైక్ రేట్.. కంగారులపై ఊరమాస్ ఊచకోత.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ భారీ రికార్డ్

IND vs AUS, Rohit Sharma Fastest Half Century in Just 19 Balls: T20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన హిట్‌మ్యాన్.. ఏకంగా తన ఖాతాలో ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కంగారులను భయపెట్టడమే కాకుండా.. టీమిండియాను సెమీస్‌కు చేర్చడంలో విజయవంతమయ్యాడు.

IND vs AUS: 19 బంతులు.. 263 స్ట్రైక్ రేట్.. కంగారులపై ఊరమాస్ ఊచకోత.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ భారీ రికార్డ్
అలాగే టీ20 ప్రపంచకప్‌లో 50 సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో 31 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుతం రోహిత్ శర్మ 43 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.

Updated on: Jun 25, 2024 | 7:21 AM

Rohit Sharma Fastest Half Century in Just 19 Balls: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌తో కంగారూలను భయపెట్టాడు. విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ ప్రారంభించాడు. కానీ, విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయితే, ఈ ఒత్తిడి రోహిత్ శర్మపై రాకపోవడంతో హిట్‌మ్యాన్ తన తరహాలో దూకుడు ఆడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రోహిత్ 100 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..

రోహిత్ శర్మ ఈ ఫిఫ్టీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత బ్యాట్స్‌మెన్ చేసిన మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా మారింది. 2007లో డర్బన్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో చేసిన హాఫ్ సెంచరీనే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకంగా నిలిచింది. ఆ తర్వాత, 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై కేఎల్ రాహుల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇప్పుడు మూడో స్థానంలో నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో భారతీయుల ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు..

యువరాజ్ సింగ్ – 12 బంతులు – భారత్ vs ఇంగ్లండ్ – 2007

KL రాహుల్ – 18 బంతులు – భారత్ vs స్కాట్లాండ్, 2021

రోహిత్ శర్మ – 19 బంతులు – భారతదేశం vs ఆస్ట్రేలియా, 2024

యువరాజ్ సింగ్ – 20 బంతులు – భారత్ vs ఆస్ట్రేలియా, 2007

సూర్యకుమార్ యాదవ్ – 23 భారత్ vs జింబాబ్వే, 2022

రోహిత్ ఖాతాలో 200 సిక్సర్లు..

తుఫాన్ హాఫ్ సెంచరీనే కాదు.. రోహిత్ శర్మ మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ తర్వాత తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ 173 సిక్సర్లు కొట్టాడు.

పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు..

1) రోహిత్ శర్మ – 150 ఇన్నింగ్స్‌లలో 200*

2) మార్టిన్ గప్టిల్ – 118 ఇన్నింగ్స్‌లలో 173

3) జోస్ బట్లర్ – 113 ఇన్నింగ్స్‌లలో 137

4) గ్లెన్ మాక్స్‌వెల్ – 103 ఇన్నింగ్స్‌లలో 133

5) నికోలస్ పూరన్ – 87 ఇన్నింగ్స్‌లలో 132.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..