IND vs AUS: భారత్‌, ఆసీస్‌ నాలుగో టీ20 మ్యాచ్.. శ్రేయస్‌ ఎంట్రీ.. పిచ్‌, వెదర్‌ రిపోర్టులు ఎలా ఉన్నాయంటే?

|

Dec 01, 2023 | 7:48 AM

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం (డిసెంబర్‌ 1) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉండగా ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది

IND vs AUS: భారత్‌, ఆసీస్‌ నాలుగో టీ20 మ్యాచ్.. శ్రేయస్‌ ఎంట్రీ.. పిచ్‌, వెదర్‌ రిపోర్టులు ఎలా ఉన్నాయంటే?
India vs Australia
Follow us on

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం (డిసెంబర్‌ 1) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉండగా ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు మూడో టీ20 మ్యాచ్‌లో అనూహ్యంగా విజయం సాధించిన ఆసీస్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో భారత్ 200కు పైగా పరుగులు చేసినా ఓటమి పాలైంది. అందుకోసం టీమ్ ఇండియా పక్కా ప్లాన్ వేసుకుని బరిలోకి దిగాలి. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం కాబట్టి హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది.

శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ..

కాగా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రాకతో మెన్ ఇన్ బ్లూ బ్యాటింగ్ బలం పెరిగింది. మరోవైపు అయ్యర్ కోసం తిలక్ వర్మ తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. మరోవైపు ప్రసిద్ధ్‌ కృష్ణ, దీపక్ చాహర్‌లలో ఎవరిని ఎంపిక చేయాలనేది కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌కు తలనొప్పిగా మారింది. భారత్ వరుస విజయాలతో సిరీస్‌ను ప్రారంభించింది. అయితే గత మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు చేసినప్పటికీ.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో ఓడిపోయింది. మెన్ ఇన్ బ్లూ ఓటమి నుంచి పుంజుకోవడానికి బౌలింగ్‌లో మార్పు చేయడం దాదాపు ఖాయమైంది.

సీనియర్లు లేకుండానే..

మూడో టీ20 తర్వాత పలువురు సీనియర్ ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. కాబట్టి, 4వ టీ20లో ఆసీస్ భారీ మార్పులతో రంగంలోకి దిగుతుంది. గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్ స్వదేశానికి వెళ్లిపోయారు. వీరి స్థానంలో బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, క్రిస్ గ్రీన్ జట్టులో చేరారు. మరోవైపు బౌలింగ్ విభాగంపై కూడా ఆసీస్ దృష్టి సారించింది.

ఇవి కూడా చదవండి

రాయ్‌పూర్ పిచ్ రిపోర్ట్:

చాలా భారత పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటాయి. రాయ్‌పూర్ ట్రాక్ దీనికి భిన్నంగా ఉంటుదిది. పిచ్ నెమ్మదిగా ఉండడంతో ఇక్కడ బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే జరిగింది. కాబట్టి పిచ్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఇక్కడ జరిగిన 29 టీ20 మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లపై ఛేజింగ్ జట్లు 16-13తో రికార్డు సృష్టించాయి. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు.

 

టీమ్ ఇండియా:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింఘోయ్, పర్దీష్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

ఆస్ట్రేలియా జట్టు:

మాథ్యూ వేడ్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..