IND vs AUS Playing XI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా బ్యాటింగ్.. ఇరుజట్ల ప్లేయింట్ 11 ఇదే..

|

Nov 19, 2023 | 1:47 PM

ICC Men’s ODI world cup India vs Australia Playing XI: ODI ప్రపంచ కప్ 2023లో అతిపెద్ద మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఆతిథ్య భారత్ వర్సెస్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IND vs AUS Playing XI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా బ్యాటింగ్.. ఇరుజట్ల ప్లేయింట్ 11 ఇదే..
Icc Cricket World Cup 2023 India Vs Australia, Final
Follow us on

ICC Men’s ODI world cup India vs Australia Playing XI: ODI ప్రపంచ కప్ 2023లో అతిపెద్ద మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఆతిథ్య భారత్ వర్సెస్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా సారథి పాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

టోర్నీలో ఇరు జట్లు రెండోసారి ఫైనల్‌లో తలపడనున్నాయి. 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా వీరి మధ్యనే జరిగింది. తర్వాత కంగారూ జట్టు 125 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

భారత్ నాలుగోసారి, ఆస్ట్రేలియా 8వ సారి ప్రపంచకప్ ఫైనల్ బరిలోకి..

భారత జట్టు నాలుగోసారి ఫైనల్ చేరింది. ఇంతకుముందు 1983, 2003, 2011లో ఈ టోర్నీ ఫైనల్స్‌కు చేరింది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు 8వ సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. 7 ఫైనల్స్‌లో 5 గెలిచింది.

గత 27 ఏళ్లుగా ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓడిపోలేదు. గత 24 ఏళ్లలో ఆ జట్టు 4 ఫైనల్స్‌లోనూ విజయం సాధించింది. 1996లో శ్రీలంకపై ఫైనల్‌లో ఆస్ట్రేలియా చివరి ఓటమి.

హోరాహోరీగా, ఇటీవలి రికార్డు..

ఈ ప్రపంచకప్‌లోని 5వ లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఆ తర్వాత చెన్నైలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 150 వన్డేలు జరిగాయి. భారత్‌ 57 మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌లు గెలిచాయి. 10 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..