India vs Australia Playing XI: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే పోరు మొదలైంది. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో ఇరు జట్ల కెప్టెన్ల మధ్య టాస్ జరిగింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ తర్వాత, ఇద్దరు కెప్టెన్లు కూడా తమ ప్లేయింగ్ 11ని స్పష్టం చేశారు. ఇండోర్ వన్డే కోసం భారత జట్టు ఒక మార్పు చేసింది. కాగా, ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది.
భారత్ , ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ లో ఇది రెండో మ్యాచ్ . అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇండోర్ వన్డే కోసం టీమిండియా చేసిన మార్పులు బౌలింగ్‌లో ఉన్నాయి. భారత జట్టులో బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కింది. రెండో వన్డే నుంచి బుమ్రాకు విశ్రాంతి లభించింది. నిజానికి రెండో వన్డే కోసం బుమ్రా జట్టుతో కలిసి ఇండోర్‌కు కూడా చేరుకోలేదు. అతని స్థానంలో ముఖేష్ కుమార్‌ను టీమిండియాలోకి తీసుకున్నారు. కానీ, టీం మేనేజ్‌మెంట్ మాత్రం ప్రసీద్ధ్ వైపే మొగ్గు చూపింది.
ఆస్ట్రేలియా జట్టులో 3 మార్పులు ఉన్నాయి. పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్ జట్టు నుంచి తప్పుకోగా, వారి స్థానంలో అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్‌లకు అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో స్పెన్సర్ జాన్సన్ వన్డే అరంగేట్రం చేయనున్నాడు.
భారత ప్లేయింగ్ ఎలెవన్: రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, ఆర్. అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, జోస్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, మాథ్యూ షార్ట్, జోష్ హేజిల్‌వుడ్, షాన్ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..