India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాకు ఓ చెత్త రికార్డును గుర్తు చేసింది. అది టీమిండియా మరచిపోలేని చేదు జ్ఞాపకంగా వీడియో రూపంలో షేర్ చేసింది.
అవును, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. అది కూడా బోర్డర్ – గవాస్కర్ టెస్టు సిరీస్‌లోనే కావడం గమనార్హం. 2020-21లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 36 పరుగులకే ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో భారత్ పాలిట చెత్త స్కోర్ నమోదైంది.
అడిలైడ్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 244 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది.
స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి తడబడింది. ఫలితంగా 21.2 ఓవర్లలో కేవలం 36 పరుగులకే ఇన్నింగ్స్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది.
All out for 36 ?
The Border-Gavaskar Trophy starts on Thursday! #INDvAUS pic.twitter.com/Uv08jytTS7
— cricket.com.au (@cricketcomau) February 6, 2023
2023 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ముందు, క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో భారత జట్టుకు గత సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫలితం గుర్తుకు వచ్చింది.
సిరీస్ ప్రారంభం కాకముందే సోషల్ మీడియా ద్వారా ఇరు జట్ల మధ్య పోరు మొదలైంది. కాబట్టి తొలి మ్యాచ్ నుంచే ఇండో-ఆసీస్ ఆటగాళ్ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీ నెలకొని ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు – మొదటి టెస్ట్ (విదర్భ క్రికెట్ స్టేడియం)
ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు – రెండవ టెస్ట్ (అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఢిల్లీ)
మార్చి 1 నుంచి 5 వరకు – మూడో టెస్టు (ధర్మశాల క్రికెట్ స్టేడియం, హిమాచల్ ప్రదేశ్)
మార్చి 9 నుంచి 13 వరకు – నాల్గవ టెస్ట్ (నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..