India vs Australia: భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో నేడు రెండో మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించనుంది.
విశాఖపట్నం గణాంకాలు కూడా భారత్‌కు అనుకూలంగా ఉన్నందున భారత్‌కు విజయావకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ భారత జట్టు గత 10 ఏళ్లుగా ఒక్క వన్డే మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇది మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మైదానంలో పరుగుల వర్షం కురిపించారు.
కంగారూలతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో.. హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. విశాశ వన్డేలో మాత్రం రోహిత్ శర్మ రీఎంట్రీ ఇచ్చాడు.
షమీ భజ్జీ రికార్డును బద్దలు కొట్టు ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన పరంగా హర్భజన్ సింగ్‌ను మహ్మద్ షమీ వదిలివేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇద్దరి ఖాతాలో తలో 32 వికెట్లు ఉన్నాయి.
స్వదేశంలో ఆస్ట్రేలియా కంటే భారత్ ఎక్కువ మ్యాచ్‌లు గెలిచే ఛాన్స్ ఉంది. భారత పిచ్‌లలో భారత్, ఆస్ట్రేలియా టీంలు తలో 30 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత్ తమ సొంత పిచ్‌పై కంగారూలను అధిగమించే ఛాన్స్ ఉంది.
విశాఖపట్నంలో నిన్న అంటే మార్చి 18న వర్షం కురిసింది. కానీ, ప్రస్తుతం వాతావరణం స్పష్టంగా ఉంది. ఈరోజు మేఘావృతమై ఉంది. ప్రస్తుతం వర్షం కురిసే అవకాశం లేదని అంటున్నారు. గాలి వేగం గంటకు 12-14 కి.మీ. వీస్తోంది. ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.
ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఉత్కంఠకు భంగం కలిగించే ఛాన్స్ ఉంది. ఇక్కడ 80 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో బలమైన గాలులు, ఉరుములు కూడా రావచ్చని అంటున్నారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..