BGT 2023: మార్చి 13, 2023 భారతదేశానికి చాలా ప్రత్యేకమైన రోజు. క్రికెట్‌తోపాటు, సినిమాలలో భారతదేశం పేరు మార్మోగిపోయింది. ఒకవైపు క్రికెట్‌లో ఆస్ట్రేలియాను 2-1తో సిరీస్‌లో ఓడించిన భారత్.. వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు భారతీయ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు-నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ పాట సోషల్ మీడియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎంతోమంది ఈ పాటకు స్టెప్పులు వేస్తూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి టీమిండియా క్రికెటర్లు కూడా చేరారు.
RRRలోని ఈ పాటలో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరు ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. రవిచంద్రన్ అశ్విన్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు. అందులో రవీంద్ర జడేజాతో కలిసి RRR స్టైల్‌లో నడుస్తూ కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో నాటు నాటు పాట ప్లే అవుతున్నట్లు చూడొచ్చు.
ఈ వీడియోలో రవీంద్ర జడేజా, అశ్విన్ మొదట కామెడీ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ RRR పాటలోలాగే నాటు నాటు పాడే శైలిలో నడుచుకున్నారు. అశ్విన్, జడేజాల ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మొత్తం సిరీస్‌లో అశ్విన్, జడేజా అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 25 వికెట్లు, 86 పరుగులు చేయగా.. ఈ సిరీస్‌లో రవీంద్ర జడేజా 22 వికెట్లు తీసి మొత్తం 135 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ టైటిల్‌ను అందుకున్నారు. అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి 480 పరుగులు చేసింది.
ఆ తర్వాత భారత జట్టు 571 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లి 186 పరుగులతో సత్తా చాటాడు. శుభమాన్ గిల్ కూడా 128 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు పరస్పర అంగీకారంతో ఈ మ్యాచ్‌ను డ్రా గా ప్రకటించారు. దీంతో భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..