Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డ్.. ఏకంగా రోహిత్‌నే బ్రేక్ చేశాడుగా..

Virat kohli: టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలపై దృష్టి సారించారు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల నేపథ్యంలో ఈ సిరీస్ కీలకం కానుంది. ఇలాంటి కీలక సమయంలో కోహ్లీ సున్నాకే అవుట్ అవ్వడం అతని భవిష్యత్తుపై, వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతని స్థానంపై సందేహాలను పెంచింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డ్.. ఏకంగా రోహిత్‌నే బ్రేక్ చేశాడుగా..
Virat Kohli

Updated on: Oct 19, 2025 | 12:33 PM

Virat Kohli Dock Out: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది. అయితే, ఈ డకౌట్ ద్వారా కోహ్లీ ఒక అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత ఆటగాళ్లలో వన్డే ఇంటర్నేషనల్స్ (ODI)లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ అధిగమించాడు.

వన్డేల్లో కోహ్లీ 17వ డక్..! రోహిత్‌ను దాటేశాడు

పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే (0 పరుగుల) వెనుదిరిగాడు.

ఇవి కూడా చదవండి

వన్డే క్రికెట్‌లో 17వ డక్..

ఈ డక్‌తో, కోహ్లీ భారత ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక డక్‌లు చేసిన వారి జాబితాలో రోహిత్ శర్మను (16 డక్‌లు) అధిగమించాడు.

వన్డేల్లో అత్యధిక డక్‌ ఔట్ అయిన భారత ఆటగాళ్లు..

భారత ఆటగాళ్ళు డక్ ఔట్స్
సచిన్ టెండూల్కర్ 20
జవగళ్ శ్రీనాథ్ 19
అనుల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ 18
విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్ 17
రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ 16

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ముందుకు వెళ్లడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

అత్యధికంగా 463 ODI మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ 20 డక్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లు అయిన జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లేలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీ ఫామ్‌పై ప్రశ్నలు..

టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలపై దృష్టి సారించారు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల నేపథ్యంలో ఈ సిరీస్ కీలకం కానుంది. ఇలాంటి కీలక సమయంలో కోహ్లీ సున్నాకే అవుట్ అవ్వడం అతని భవిష్యత్తుపై, వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతని స్థానంపై సందేహాలను పెంచింది. కోహ్లీ కెరీర్‌లోని కొన్ని ముఖ్యమైన సిరీస్‌లలో, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో, ఆఫ్-స్టంప్‌కు దూరంగా వెళ్లే బంతులను అనవసరంగా ఆడటానికి ప్రయత్నించి వికెట్‌ను కోల్పోవడం తరచుగా కనిపించింది. ఈ బలహీనతను ఆస్ట్రేలియన్ పేసర్లు, ముఖ్యంగా స్కాట్ బోలాండ్ లాంటి బౌలర్లు, తరచుగా తమ ఆయుధంగా ఉపయోగించుకున్నారు.

తొలి వన్డేలో కీలక ఆటగాళ్లు త్వరగా అవుట్ అవ్వడం జట్టుపై ఒత్తిడిని పెంచింది. రాబోయే మ్యాచ్‌లలో కోహ్లీ తిరిగి పుంజుకుని జట్టుకు కీలకమైన పరుగులు అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..