Asia Cup 2023: సెల్ఫీ కోసం వెంటపడిన అభిమాని.. ఆరోజు ఇస్తానంటూ హామీ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..

Virat Kohli: ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న శ్రీలంకలో పాకిస్థాన్‌తో ఆడనుంది. ఆసియా కప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ప్లాన్ చేయగా, ఇందులో శ్రీలంకలో 9, పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు జరుగుతాయి. విరాట్ కోహ్లీ ఆగస్టు 23 నుండి ఆసియా కప్ 2023 కోసం భారత జట్టులో చేరనున్నట్లు వీడియో ద్వారా ధృవీకరించారు.

Asia Cup 2023: సెల్ఫీ కోసం వెంటపడిన అభిమాని.. ఆరోజు ఇస్తానంటూ హామీ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
Virat Kohli Viral Video

Updated on: Aug 12, 2023 | 9:03 PM

Virat Kohli Asia Cup 2023: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఏ సిరీస్‌లోనూ భాగం కావడం లేదు. ఆసియా కప్ ద్వారా కోహ్లీ తిరిగి భారత జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వెస్టిండీస్ టూర్‌లో టీమ్ ఇండియా టీ20 సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ పర్యటనకు కూడా కోహ్లీ జట్టులో భాగం కావడం లేదు.

అభిమానికి హామీ ఇచ్చిన విరాట్..

అదే సమయంలో కోహ్లి తన రీఎంట్రీపై మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబై విమానాశ్రయంలో తన కారు వద్దకు వెళ్తుండగా ఓ అభిమాని కోహ్లీని సెల్ఫీ అడిగాడు. ఇంతలో, తన భవిష్యత్ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ, కోహ్లీ ఆగస్టు 23 అని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్‌నకు సన్నద్ధమయ్యేందుకు ఆగస్టు 23న బెంగళూరులో జరిగే భారత జట్టులో చేరనున్నట్లు కోహ్లీ ధృవీకరించాడు.

ఇన్‌స్టా ఆదాయంపై వస్తున్న రూమర్లపై విరాట్ ట్వీట్..

ఆగస్టు 23న జాతీయ శిబిరానికి వెళ్లే సమయంలో సెల్ఫీ ఇస్తానని కోహ్లి ఆ వీడియోలో అభిమానికి హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆటగాళ్లు తమ ప్రణాళికల గురించి చెప్పడంలో వెనుకడుగు వేస్తుంటారు. కానీ, కోహ్లీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. వెస్టిండీస్ పర్యటనలో కోహ్లి టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడుతూ కనిపించాడు. టెస్టులో సెంచరీ కూడా చేశాడు.

జర్నీలో ఇన్‌స్టా పోస్ట్..

కోహ్లి తరచుగా అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇవ్వడం కనిపిస్తుంది. మైదానంలో దూకుడుగా కనిపించే కింగ్ కోహ్లీ మైదానం వెలుపల చాలా మర్యాదగా కనిపిస్తాడు. కోహ్లీ ఎప్పుడూ అభిమానులతో సన్నిహితంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ స్టైల్‌తో కోహ్లీకి మంచి పేరుంది.

ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం..

ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత జట్టు తన మొదటి గేమ్‌ను సెప్టెంబర్ 2న శ్రీలంకలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టీంతో ఢీకొట్టనుంది. ఆసియా కప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ప్లాన్ చేయగా, ఇందులో శ్రీలంకలో 9, పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు జరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..