Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యానికి ఐస్‌లాండ్ రెడీ.. ఫన్నీగా ఐసీసీకి లేఖ..

Iceland Cricket: ఆగస్ట్-సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ పొందడం గమనార్హం. రెండు దేశాల మధ్య సంబంధాల బలహీనత కారణంగా భారత్ అక్కడ ఆడేందుకు నిరాకరించింది. దీని తర్వాత టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో ఆడారు. పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చింది. శ్రీలంకలో ఫైనల్‌తో సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యానికి ఐస్‌లాండ్ రెడీ.. ఫన్నీగా ఐసీసీకి లేఖ..
Iceland Cricket

Updated on: Nov 29, 2023 | 11:35 AM

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy) ఆతిథ్యం పాకిస్తాన్‌కు దక్కింది. అయితే, గత కొన్ని రోజులుగా, ఈ టోర్నమెంట్‌ను దుబాయ్‌లో లేదా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించవచ్చని నివేదికలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ టోర్నీని పాకిస్తాన్‌లో ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. కాగా, ఇలాంటి ఊహాగానాల మధ్య ఐస్‌లాండ్ క్రికెట్ (Iceland Cricket) ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి దావా వేసింది. దీని కోసం ICCకి ఒక ఆసక్తికరమైన లేఖ కూడా రాసింది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఈ రోజు మా బిడ్‌ను విడుదల చేశాం. ICC గ్రెగ్ బార్క్లే దీనిపై ఏమి సమాధానం ఇస్తారో వినేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం అంటూ రాసుకొచ్చింది.

‘ఫిబ్రవరి-మార్చిలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది చల్లగా ఉన్నా.. దానికి తగినంత విద్యుత్ అందుబాటులో ఉంటుంది. మాకు ప్యానెల్ హీటర్లు కూడా ఉన్నాయి. ఇది ఆటగాళ్లను వెచ్చగా ఉంచుతుంది. ఇక్కడ మీరు ఆసియాలో చూసిన పేలవమైన డ్రైనేజీ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు’ అంటూ ట్వీట్‌లో ఐసీసీకి విన్నవించింది.

దీనితో పాటు, T20 ప్రపంచ కప్ 2024 ఆతిథ్యం కోసం ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు కూడా అమెరికన్ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడింది. అమెరికా కంటే ఐస్‌లాండ్‌లో మెరుగైన మైదానాలు ఉన్నాయని, క్రికెట్ అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని అందులో పేర్కొంది.

ఆగస్ట్-సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ పొందడం గమనార్హం. రెండు దేశాల మధ్య సంబంధాల బలహీనత కారణంగా భారత్ అక్కడ ఆడేందుకు నిరాకరించింది. దీని తర్వాత టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో ఆడారు. పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చింది. శ్రీలంకలో ఫైనల్‌తో సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి.

ఐస్‌లాండ్ తన ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేసిన ట్వీట్..

నివేదికలను విశ్వసిస్తే, దుబాయ్ ఛాంపియన్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వవచ్చు. అయితే భారత జట్టు అక్కడ ఆడేందుకు నిరాకరిస్తే బీసీసీఐ తమకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పాకిస్థాన్ ఇప్పటికే ఐసీసీకి స్పష్టంగా చెప్పింది. దీంతో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..