ఐసీసీ నుంచి ఇండియాకు రూ.12 కోట్లు, పాకిస్థాన్‌కు రూ.4 కోట్లు..! ఎందుకంటే..?
2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచి ₹12.33 కోట్లు బహుమతిని గెలుచుకుంది. అట్టడుగు స్థానంలో ఉన్న పాకిస్థాన్‌కు ₹4.11 కోట్లు లభించాయి. విజేత ₹30.82 కోట్లు, రన్నరప్ ₹18.49 కోట్లు పొందుతారు. భారత జట్టు WTC ఫైనల్‌కు చేరలేకపోవడం, భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు కూడా ఈ ప్రైజ్ మనీలో ప్రభావం చూపాయి.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నుంచి ఇండియాకు రూ.12.33 కోట్లు, పాకిస్థాన్‌కు 4.11 కోట్లు బహుమతిగా అందనున్నాయి. అదేంటి ఇప్పుడు ఏ టోర్నీ ఉందని వీళ్లకు ప్రైజ్‌మనీ అని ఆశ్చర్యపోతున్నారా? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-2025 ముంగిపు దశకు చేరుకోవడంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ తర్వాత డబ్ల్యూటీసీలో పాల్గొన్న అన్ని టీమ్స్‌కు ప్రైజ్‌మనీ ఇవ్వనుంది ఐసీసీ. అందులో భాగంగా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచిన ఇండియాకు రూ.12.33 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కనున్నాయి.
అలాగే అట్టడుగు స్థానంలో నిలిచిన పాకిస్థాన్‌కు అన్ని టీమ్స్ కంటే తక్కువ రూ.4.11 కోట్లు దక్కున్నాయి. పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్, వెస్టిండీస్‌కు ఎక్కువ ప్రైజ్‌మనీ అందనుంది. కాగా విజేత, రన్నరప్‌లు వరుసగా రూ.30.8 కోట్లు, రూ.18.49 కోట్ల భారీ మొత్తాన్ని ప్రైజ్‌మనీగా పొందనున్నాయి. ఒక దశలో టీమిండియా వరుసగా మూడవ WTC ఫైనల్‌కు చేరుకుంటుందని అంతా భావించారు. కానీ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో, ఆపై ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో ఓడిపోయారు. దీంతో ఫైనల్‌కు చేరలేకపోయారు. భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ రెండు దేశాల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరగడం లేదు.
2023-25 WTCలో ఎవరికి ఎంత
- విజేత – ఆస్ట్రేలియా/దక్షిణాఫ్రికా – 30.82 కోట్లు
- రన్నరప్ – ఆస్ట్రేలియా/దక్షిణాఫ్రికా – 18.49 కోట్లు
- 3వ స్థానం – టీమిండియా – 12.33 కోట్లు
- 4వ స్థానం – న్యూజిలాండ్ – 10.28 కోట్లు
- 5వ స్థానం – ఇంగ్లాండ్ – 8.22 కోట్లు
- 6వ స్థానం – శ్రీలంక – 7.19 కోట్లు
- 7వ స్థానం – బంగ్లాదేశ్ – 6.17 కోట్లు
- 8వ స్థానం – వెస్టిండీస్ – 5.14 కోట్లు
- 9వ స్థానం – పాకిస్తాన్ – 4.11 కోట్లు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




