AUS Vs PAK: పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఆసీస్ బ్యాటర్లు.. బాబర్ అండ్ కో ముందు భారీ టార్గెట్.!

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులో పాకిస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు వార్నర్(163), మిచెల్ మార్ష్(121) అద్భుత సెంచరీల సాయంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఈ ఇద్దరూ బాగా ఆడినప్పటికీ.. పాకిస్తాన్ వీరిని పెవిలియన్ చేర్చిన వెంటనే పుంజుకుంది.

AUS Vs PAK: పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఆసీస్ బ్యాటర్లు.. బాబర్ అండ్ కో ముందు భారీ టార్గెట్.!
Aus Vs Pak

Updated on: Oct 20, 2023 | 6:25 PM

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులో పాకిస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు వార్నర్(163), మిచెల్ మార్ష్(121) అద్భుత సెంచరీల సాయంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఈ ఇద్దరూ బాగా ఆడినప్పటికీ.. పాకిస్తాన్ వీరిని పెవిలియన్ చేర్చిన వెంటనే పుంజుకుంది. ఇక మిగిలిన ఆసీస్ బ్యాటర్లు ఎవ్వరూ కూడా పెద్దగా రాణించలేకపోవడంతో.. ఆ జట్టు 400 మార్క్ దాటలేకపోయింది. అటు పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 5 వికెట్లు, హ్యారీస్ రవూఫ్ 3 వికెట్లు, ఉస్మానా మీర్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. మొదటి బంతి నుంచే స్ట్రాంగ్‌గా ఆడింది. ఫస్ట్ బాల్‌కే ఫస్ట్ రివ్యూ కోల్పోయిన బాబర్ అండ్ కో.. ఆ తర్వాత ఎక్కడా పుంజుకోలేకపోయింది. వార్నర్(163), మార్ష్(121) సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇద్దరూ కూడా ఒకే ఓవర్‌లో తమ సెంచరీలు పూర్తి చేసుకోవడమే కాకుండా.. ఆస్ట్రేలియాను పటిష్ట పాజిషన్‌లో ఉంచారు. కానీ వీరిరువురూ పెవిలియన్ చేరిన తర్వాత.. మరే బ్యాటర్ క్రీజులో ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా 400 మార్క్‌ను తుదిలో చేజార్చుకుంది. ఇక పాక్ ప్రధాన బౌలర్ అఫ్రిది 5 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీశాడు.

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చేధించేందుకు ఇది భారీ టార్గెట్. మరి బాబర్ అండ్ కో నెగ్గుతారో..? లేదో.? చూడాలి. అటు ఈ మ్యాచ్ పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాలపై గట్టిగానే ప్రభావం చూపించనుంది.