AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదరా.. డేవిడ్ భాయ్ అంటే.! 14 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత.. దెబ్బకు పాక్ ఇజ్జత్ పాయే..

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రీ-సౌండ్ ఇచ్చే సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న వార్నర్.. మొత్తం 124 బంతులు ఎదుర్కుని 14 ఫోర్లు, 9 సిక్సర్లతో ఏకంగా 163 పరుగులు సాధించాడు. బౌండరీలతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఇది కదరా.. డేవిడ్ భాయ్ అంటే.! 14 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత.. దెబ్బకు పాక్ ఇజ్జత్ పాయే..
Warner
Ravi Kiran
|

Updated on: Oct 20, 2023 | 6:05 PM

Share

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రీ-సౌండ్ ఇచ్చే సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న వార్నర్.. మొత్తం 124 బంతులు ఎదుర్కుని 14 ఫోర్లు, 9 సిక్సర్లతో ఏకంగా 163 పరుగులు సాధించాడు. బౌండరీలతో పాక్ బౌలర్లకు డేవిడ్ భాయ్ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా పాక్ కీలక బౌలర్ హారిస్ రవూఫ్ మాత్రం వార్నర్ ఉతికారేసాడని చెప్పాలి. మరో ఓపెనర్ మార్ష్‌తో కలిసి వార్నర్ ఏకంగా రవూఫ్ వేసిన 4 ఓవర్లలో 59 పరుగులు రాబట్టారు.

ప్రపంచకప్‌నకు ముందుగా టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌ అద్భుతంగా రాణించిన వార్నర్.. మొదటి మూడు మ్యాచ్‌లలోనూ తడబడటంతో.. ఇక జట్టులో దండగే అనుకున్నారు. కానీ విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ వార్నర్.. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకదశలో డబుల్ సెంచరీ సాధిస్తాడని అందరూ ఊహించినప్పటికీ.. పాక్ బౌలర్ రవూఫ్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో వార్నర్‌ని అవుట్ చేశాడు.

విరాట్‌ కోహ్లి రికార్డు సమం..

వార్నర్‌కి ఇది పాకిస్తాన్‌పై నాలుగో సెంచరీ. దీంతో ఓ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు వార్నర్. వన్డేలలో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లి రికార్డును వార్నర్ సమం చేశాడు. విండిస్‌పై 4సార్లు సెంచరీలు బాదేశాడు కోహ్లి. ఇక వార్నర్ ఇప్పుడు పాకిస్తాన్‌పై 4 సెంచరీలు కొట్టాడు. అయితే కోహ్లి ఒక ఏడాదిలో ఈ ఫీట్ సాధిస్తే.. వార్నర్ ఆరేళ్ల మధ్యకాలంలో ఈ రికార్డు నమోదు చేశాడు.

2017లో తన వన్డే అరంగేట్ర శతకాన్ని పాకిస్తాన్‌పై బాదేశాడు వార్నర్.. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల వ్యవధిలో బాబర్ అజామ్ జట్టుపై నాలుగు సెంచరీలు కొట్టాడు డేవిడ్ భాయ్. అలాగే ప్రపంచకప్‌లలో మూడు 150 అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా మన డేవిడ్ వార్నర్ భాయే. ‘నీ యవ్వా తగ్గేదేలే’ అంటూ సెంచరీ తర్వాత ‘పుష్ప’ సెలబ్రేషన్ జరిపాడు వార్నర్.

Follow Us
బ్లాక్ బస్టర్ 'హనుమాన్' సినిమాను మిస్ చేసుకున్న హీరోలు తెలుసా?
బ్లాక్ బస్టర్ 'హనుమాన్' సినిమాను మిస్ చేసుకున్న హీరోలు తెలుసా?
నేను ఆసుపత్రిలో ఉండగా ఆ హీరో వచ్చారు..
నేను ఆసుపత్రిలో ఉండగా ఆ హీరో వచ్చారు..
ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం
ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు
పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
ఆరు వేరియంట్లతో మార్కెట్‌లోకి టాటా ఎస్‌యూవీ..
ఆరు వేరియంట్లతో మార్కెట్‌లోకి టాటా ఎస్‌యూవీ..
రష్యాలో యూపీ ఇంజినీర్‌ అరెస్ట్.. సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి!
రష్యాలో యూపీ ఇంజినీర్‌ అరెస్ట్.. సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి!
ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? అదృష్టాన్ని మార్చే దిశ !
ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? అదృష్టాన్ని మార్చే దిశ !