AUS vs AFG: డబుల్‌ సెంచరీతో శివాలెత్తిన మ్యాక్స్‌వెల్‌.. ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించిన పవర్ హిట్టర్

|

Nov 08, 2023 | 12:14 AM

ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్ మాక్స్‌వెల్ తన బ్యాట్‌ పవర్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో తుఫాను సృష్టించాడు. డబుల్‌ సెంచరీతో శివాలెత్తి తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఆసీస్‌ జట్టు ఛేదించింది. మ్యాక్స్‌వెల్ 128 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు.

AUS vs AFG: డబుల్‌ సెంచరీతో శివాలెత్తిన మ్యాక్స్‌వెల్‌.. ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించిన పవర్ హిట్టర్
Glenn Maxwell
Follow us on

ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్ మాక్స్‌వెల్ తన బ్యాట్‌ పవర్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో తుఫాను సృష్టించాడు. డబుల్‌ సెంచరీతో శివాలెత్తి తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఆసీస్‌ జట్టు ఛేదించింది. మ్యాక్స్‌వెల్ 128 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ కేవలం 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజుల్లోకి వచ్చిన మ్యాక్సీ విధ్వంసం సృష్టించాడు. ఒకవైపు కండరాలు పట్టేస్తున్నా వాంఖడే మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. పాట్ కమిన్స్‌తో కలిసి అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందులో 179 పరుగులు మ్యాక్సీనే చేశాడంటే ఆసీస్‌ బ్యాటర్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. మ్యాక్స్‌వెల్‌ కొట్టిన ఈ డబుల్‌ సెంచరీ ఇన్నింగ్స్‌ వన్డే చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఒంటిచేత్తో జట్టును గట్టెక్కించి విజయతీరాలకు చేర్చిన మ్యాక్సీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

49 పరుగులకే 5 వికెట్లు..

ఆఫ్ఘనిస్థాన్ 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుషాగ్నే, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్.. ఇలా 49 పరుగులకు చేరుకునే ఐదుగురు టాపార్డర్‌ ప్లేయర్స్‌ పెవిలియన్‌కు చేరుకున్నారు. అఫ్గన్‌ మరొక సంచలనం సృష్టిస్తుందేమో అని చాలామంది అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే క్రీజులోకి వచ్చిన ఆరంభంలో మ్యాక్సీ కూడా తడబడ్డాడు. 22వ ఓవర్ ఐదో బంతికి మాక్స్‌వెల్ క్యాచ్‌ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ జారవిడిచాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న మ్యాక్స్‌వెల్ బౌలర్లపై విరుచుకుపడి పరుగులు సాధించాడు. 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మధ్యలో కండరాలు పట్టేశాయి. ఫిజియో రెండు సార్లు ఫీల్డ్‌కి రావాల్సి ఉన్నా మ్యాక్స్‌వెల్ అంగీకరించలేదు. అతను సరిగ్గా కూడా నిలబడలేకపోయాడు. అయితే తన పవర్‌ హిట్టింగ్‌ను మాత్రం ఆపలేదు. డబుల్ సెంచరీతో తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

మ్యాక్సీ విధ్వంసం చూశారా?

రికార్డుల పర్వం..

కాగా వన్డే క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా మాక్స్‌వెల్ నిలిచాడు. అలాగే వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 200 లకు పైగా పరుగులు చేసిన తొలి నాన్‌ ఓపెనర్‌ బ్యాటర్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు.

ఆసీస్ వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ హైలెట్స్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..