Video: ప్రపంచకప్‌ 2023లో శ్రేయాస్ భారీ సిక్సర్.. కట్‌చేస్తే.. సీటు వదిలి పరిగెత్తిన ధన శ్రీ.. వైరల్ వీడియో..

|

Nov 03, 2023 | 6:49 PM

Shreyas Iyer, ICC World Cup 2023: శ్రీలంకపై మెరుపు హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్.. ఈ ప్రపంచ కప్‌లోనే భారీ సిక్సర్ కూడా నమోదు చేశాడు. శ్రీలంకపై శ్రేయాస్ అయ్యర్ 106 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యంత పొడవైన సిక్స్‌గా నిలిచింది. 2023 ప్రపంచకప్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి ఇది రెండో అర్ధ సెంచరీ. అంతకుముందు పాకిస్థాన్‌పై 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో అయ్యర్ మొత్తం 216 పరుగులు చేశాడు.

Video: ప్రపంచకప్‌ 2023లో శ్రేయాస్ భారీ సిక్సర్.. కట్‌చేస్తే.. సీటు వదిలి పరిగెత్తిన ధన శ్రీ.. వైరల్ వీడియో..
Shreyas Iyer 106 Meter Six Dhanashree Verma
Follow us on

2023 ప్రపంచ కప్ (ICC World Cup 2023) టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ పేలవ ఫాంతో ఇబ్బంది పడ్డాడు. గత రెండు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పెవిలియన చేరాడు. కానీ, గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అయ్యర్ తన పాత ఫామ్‌లో కనిపించాడు. శ్రీలంకపై హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్ ఈ ప్రపంచకప్‌లో అత్యంత పొడవైన సిక్సర్ కూడా కొట్టాడు. శ్రీలంకపై శ్రేయాస్ అయ్యర్ 106 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యంత పొడవైన సిక్స్.

సీటులోంచి లేచి పరిగెత్తిన చాహల్ భార్య ధన శ్రీ వర్మ..

భారత ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌లో, అయ్యర్ ఓవర్‌పిచ్ బంతిని లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. అయితే ఈ సిక్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికాతో సహా ఇతర ఆటగాళ్ల భార్యలు కూర్చున్న వైపు వెళ్లింది. జట్టుకు దూరమైన భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి మ్యాచ్ చూసేందుకు అక్కడే కూర్చున్నాడు. అయ్యర్ సిక్సర్ కొట్టడంతో భయంతో సీటు నుంచి ధన్‌శ్రీ వర్మ లేచి, పక్కకు జరిగింది. రితికా కూడా సీటులోంచి లేచి పరిగెత్తింది. కానీ, బంతి ఆమె కూర్చున్న స్టాండ్ పైన గోడకు తగిలి కింద పడింది.

106 మీటర్ల సిక్స్..

ఇదే ప్రపంచకప్‌లో 101 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టిన అయ్యర్.. పొడవైన సిక్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై తుఫాన్ సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా జట్టు డేంజరస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్.. 104 మీటర్ల పొడవైన సిక్సర్‌తో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోసారి లంకపై చెలరేగిన అయ్యర్.. 106 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టి.. మళ్లీ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ ప్రపంచకప్‌లో 216 పరుగులు..

2023 ప్రపంచకప్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి ఇది రెండో అర్ధ సెంచరీ. అంతకుముందు పాకిస్థాన్‌పై 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో అయ్యర్ మొత్తం 216 పరుగులు చేశాడు.

ఇరుజట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

శ్రీలంక: కుసాల్ మెండిస్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, చరిత్ అసలంక, పాతుమ్ నిస్సంక, దుషన్ హేమంత, సదీర సమరవిక్రమ, మహేశ్ తీక్షన, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..