ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ ప్రదర్శనతో మ్యాచ్‌ల్ని మలుపు తిప్పుతున్నాడు. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నిలకడగా ఆడుతున్న బాబర్ అజమ్‌ని అద్భుతమైన బంతితో కుల్దీప్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్‌కి దూరంగా పడిన బంతి ఊహించని విధంగా టర్న్ తీసుకుని.. ఆఫ్ స్టంప్‌ను తాకింది. ఇప్పుడు ఆ బంతిని 26ఏళ్ల క్రితం షేన్‌వార్న్ విసిరిన ‘బాల్ ఆఫ్ సెంచరీ’తో పోలుస్తున్నారు.
ఇంగ్లాండ్‌తో 1993లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్.. బంతిని లెగ్ స్టంప్‌కి దూరంగా విసిరి టర్న్ చేశాడు. దీంతో ఆ బంతిని నిలువరించేందుకు బ్యాట్స్‌మెన్ మైక్ ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. అతని బ్యాట్ పక్క నుంచి వెళ్లిన బంతి ఆఫ్ స్టంప్‌ని ముద్దాడింది. అప్పట్లో ఈ బంతిని ‘బాల్ ఆఫ్ సెంచరీ’గా క్రీడా పండితులు అభివర్ణించారు. తాజాగా కుల్దీప్ యాదవ్.. మరోసారి ఆ బంతిని గుర్తు చేశాడు.
Kuldeep Yadav's sensational delivery to Babar Azam was adjudged to be yesterday's @Nissan Play of the Day!#INDvPAK | #CWC19 | #TeamIndia pic.twitter.com/sJrUXE7wMB
— ICC (@ICC) June 17, 2019