ఇదేందయ్యా ఇదీ.. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ రేట్లు ఇంత తక్కువనా.. పైగా మన దేశంలోనే..

ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌ ఈ నెల 30 నుంచి జరగనుంది. భారత్, శ్రీలంక ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. 12 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. దీనికి సంబంధించిన టికెట్లను ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ టికెట్లు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండడం గమనార్హం.

ఇదేందయ్యా ఇదీ.. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ రేట్లు ఇంత తక్కువనా.. పైగా మన దేశంలోనే..
Icc Women's World Cup 2025

Updated on: Sep 04, 2025 | 9:57 PM

ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌కు అంతా సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి ఈ టోర్నీ జరగనుంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ కప్ టిక్కెట్లను రిలీజ్ చేసింది. టోర్నమెంట్‌లోని అన్ని లీగ్ మ్యాచ్‌లకు టిక్కెట్లను విడుదల చేశారు. ఐసీసీ గ్లోబల్ ఈవెంట్లలో ఇదే అత్యంత తక్కువ ధర కావడం విశేషం. కనీస టికెట్ ధర రూ.100 గా నిర్ణయించారు. ఎక్కువ మంది ప్రేక్షకులను స్టేడియానికి రప్పించేందుకే తక్కు ధరలను పెట్టినట్లు తెలుస్తోంది.

భారత్-శ్రీలంక మధ్య ప్రారంభ మ్యాచ్

మహిళల ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని, అభిమానులను ఆకట్టుకునేలా టిక్కెట్ ధరలను తక్కువగా ఉంచారు. దీని ద్వారా స్టేడియాలు నిండిపోయి, ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుందని ఐసీసీ ఆశిస్తోంది.

శ్రేయా ఘోషల్ ప్రదర్శనతో గ్రాండ్ ఓపెనింగ్

మహిళల ప్రపంచ కప్ వేడుకలను మరింత ఘనంగా చేయడానికి, టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు గౌహతిలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ వేడుకలో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ ప్రదర్శన ఇవ్వనున్నారు. టోర్నమెంట్ యొక్క అధికారిక గీతం ‘బ్రింగ్ ఇట్ హోమ్’ ను కూడా శ్రేయా ఘోషల్ రికార్డ్ చేశారు. ఈ వేదికపై ఆమె మహిళా క్రికెటర్ల శక్తి, స్ఫూర్తి, ఐక్యతను చాటుతూ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు.

భారత జట్టులో మార్పులు

12 ఏళ్ల తర్వాత మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ దేశంలో జరుగుతుండడం విశేషం. ఈ టోర్నమెంట్ శ్రీలంకలోని కొలంబోతో పాటు దేశంలోని నాలుగు నగరాలు.. గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, నవీ ముంబైలలో జరగనుంది. ఈ లోపు ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఒక మార్పు జరిగింది. వైజాగ్‌లో జరిగిన సన్నాహక శిబిరంలో ఎడమ మోకాలికి గాయమైన యాస్తిక భాటియా స్థానంలో ఉమా చెత్రిని జట్టులోకి తీసుకున్నారు.

భారత మహిళల క్రికెట్ జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రద్ధ, శిఖా పాండే, చరజోత్, కృష్ణమూర్తి, శ్రీమాన్ గౌడ్, స్నేహ రాణా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్).

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..