ICC Test Rankings: బ్యాట్స్‌మెన్, బౌలర్ల కోసం ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ (ICC Test Rankings) విడుదల చేసింది. కొత్త ర్యాంకింగ్‌లో కొన్ని మార్పులు జరిగాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson)కు భారీ షాక్ తగిలింది. అతని స్థానాన్ని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) దక్కించుకున్నాడు. అదే సమయంలో, భారత్‌తో జరిగిన జోహన్నెస్‌బర్గ్ టెస్టులో 96 పరుగులతో అజేయంగా నిలవడంతోపాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఈ టెస్ట్ ర్యాకింగ్స్‌లో తన సత్తా చాటాడు. 4 స్థానాలు ఎగబాకి, బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 జాబితాలో ఒకడిగా నిలిచాడు. అంటే ప్రస్తుతం ఈ జాబితాలో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
బ్యాట్స్‌మెన్‌ల కొత్త టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లాబుషాగ్నే 924 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ 881 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మూడో నంబర్ బ్యాట్స్‌మెన్‌లో మార్పు వచ్చింది.
టాప్ 3 నుంచి కేన్ విలియమ్సన్ ఔట్..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ల కొత్త టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 3 నుండి నిష్క్రమించాడు. ప్రస్తుతం ఆయన స్థానం నాలుగో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 871 రేటింగ్ పాయింట్లతో అతని స్థానంలో అంటే 3వ స్థానం చేరుకున్నాడు. టాప్ 5 బ్యాట్స్‌మెన్ జాబితాలో టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ 5వ స్థానంలో నిలిచాడు.
విరాట్, బాబర్ మధ్య 10 పాయింట్ల అంతరం..
టీమిండియా టెస్ట్ సారథి విరాట్ కోహ్లీ 9వ స్థానంలో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కంటే ముందు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 8వ స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజం, విరాట్ కోహ్లీ మధ్య 10 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. తాజాగా ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ల టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా స్థానం కోల్పోయాడు. వార్నర్ 6వ ర్యాంక్ నుంచి 7వ స్థానానికి పడిపోయాడు. అతని స్థానంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ దిముత్ కరుణరత్నే 6వ స్థానంలో నిలిచాడు.
పాక్ బౌలర్‌కు కూడా భారీ నష్టం!
ఐసీసీ బౌలర్ల కొత్త టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు జరిగాయి. దీని కారణంగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది నష్టపోయాడు. షాహీన్ ఇప్పుడు టాప్ 3 నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జామీసన్ వచ్చిచేరాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికీ 895 పాయింట్లతో టెస్టు బౌలింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాడు అశ్విన్ 861 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
? Steve Smith overtakes Kane Williamson
? Kyle Jamieson launches into third spotThe latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings ?
Full list: https://t.co/0D6kbTluOW pic.twitter.com/vXD07fPoES
— ICC (@ICC) January 12, 2022
Also Read: