ICC T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ టీంలో ఈ 14 మంది ఆటగాళ్లు ఫిక్స్..? మిగతా స్థానాల కోసం తీవ్రమైన పోటీ

|

Sep 07, 2021 | 7:45 AM

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే పలు దేశాలు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాయి. అయితే బీసీసీఐ 18 లేదా 20 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ICC T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ టీంలో ఈ 14 మంది ఆటగాళ్లు ఫిక్స్..? మిగతా స్థానాల కోసం తీవ్రమైన పోటీ
Indian T20 Team
Follow us on

Indian T20 World Cup Team: వచ్చే నెలలో జరిగే ఐసీసీ టీ 20 ప్రపంచకప్ కోసం భారత జట్టు సెలెక్టర్లు జట్టును ఎంపిక చేే ప్రక్రియలో పడ్డారు. ఇందులో మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ లెగ్ బ్రేక్ బౌలర్ రాహుల్ చాహర్‌ని అదనపు స్పిన్నర్ పాత్ర కోసం ఎంపిక చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం లేదా బుధవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి ఆన్‌లైన్‌లో, కోచ్ రవిశాస్త్రితోపాటు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా (సెలెక్షన్ కమిటీ కన్వీనర్) కూడా కమిటీలో భాగం కానున్నారు. ఈ ప్రపంచకప్ కోసం ఇప్పటిటే అనేక జట్లు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించాయి, అయితే బీసీసీఐ మాత్రం 18 లేదా 20 సభ్యుల బృందాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 23 మందికి బదులుగా 30 మందిని జట్టులో ఉంచడానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. ఇందులో సహాయక బృంద సభ్యులు కూడా ఉన్నారు. ఏ జట్టు అయినా 30 కంటే ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉండవచ్చు. కానీ, దాని ఖర్చులను ఆ దేశ క్రికెట్ బోర్డు భరించాల్సి ఉంటుంది. భారతదేశ వైట్ బాల్ (పరిమిత ఓవర్ల క్రికెట్) జట్టులో కనీసం 13 నుంచి 15 మంది సభ్యుల ఎంపిక దాదాపుగా ఖాయమైంది. కొన్ని స్థానాలకు మాత్రం సెలెక్టర్లు తీవ్రంగా చర్చించాల్సి వస్తోంది. జట్టులోని స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా స్థానం దాదాపుగా ఖాయం. అదనపు స్పిన్నర్ కోసం ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో అద్భుతమైన ప్రదర్శన చేసిన చక్రవర్తి, అలాగే శ్రీలంక పర్యటనలో ఆకట్టుకున్న రాహుల్ చాహర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

సూర్య కుమార్ -శ్రేయాస్ అయ్యర్‌లలో..
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరూ వికెట్ కీపర్ పాత్రను పోషించగల సమర్థులు. అయితే, శ్రీలంకలో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్, సంజు శాంసన్ కంటే వీరికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే సామ్సన్ తన ప్రతిభకు అనుగుణంగా ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రోహిత్ శర్మ, రాహుల్ తరువాత, అదనపు ఓపెనర్ స్లాట్ కోసం శిఖర్ ధావన్ లేదా పృథ్వీ షా మధ్య పోటీ ఉంటుంది. ధవన్, షా ఐపీఎల్‌తోపాటు శ్రీలంక పర్యటనలో బాగా రాణించారు.

ఫాస్ట్ బౌలింగ్‌లో..
జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ (పూర్తిగా ఫిట్‌గా ఉంటే) ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎంపిక కావడం దాదాపు ఖాయం. దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ కూడా ఇందులో బలమైన పోటీదారులుగా ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. కాబట్టి అతడిని ఎంపిక చేయకపోవచ్చు. ఇక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లలో చేతన్ సకారియా, టి నటరాజన్ కూడా జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. నటరాజన్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నప్పటికీ, సకారియా నెట్ బౌలర్‌గా జట్టుతో పాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జట్టు ఎంపిక ఇలా ఉండొచ్చు..
ఖచ్చితంగా ఎంపికయ్యే ప్లేయర్లు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, చాహల్, దీపక్ చహార్, మొహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్.

అదనపు ఓపెనర్లు: శిఖర్ ధావన్/పృథ్వీ షా
రిజర్వ్ కీపర్: ఇషాన్ కిషన్/సంజు శాంసన్
అదనపు స్పిన్నర్లు: వరుణ్ చక్రవర్తి/రాహుల్ చాహర్
లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్: చేతన్ సకారియా/టి నటరాజన్/వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై ఆధారపడి వీరి ఎంపిక ఉండోచ్చు.
జడేజా కోసం ప్రత్యామ్నాయం: ఆక్షర్ పటేల్/కృనాల్ పాండ్యా

Also Read: IND vs ENG: ఓవల్‌లో త్రివర్ణ పతాకం ఎగిరింది.. భారత ఖాతాలో 6 రికార్డులను చేర్చిన కోహ్లీసేన.. అవేంటో తెలుసా?

India Vs England 2021: 24 టెస్టుల్లో 100 వికెట్లతో రికార్డు.. ఓవర్సీస్‌ బౌలర్‌గా పేరు.. కపిల్ దేవ్‌ను వెనక్కు నెట్టిన భారత స్పీడ్‌స్టర్

IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన కోహ్లీ సేన..!