టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కాలి బొటనవేలికి గాయం అయింది. దీంతో అతడు ఆదివారం ఇండియాతో జరిగే మ్యాచ్‌లో ఆడకపోవచ్చని తెలుస్తుంది. ” మంగళవారం రాత్రి అతను ఇబ్బంది పడ్డాడు” అని కోచ్ గ్యారీ స్టెడ్ మ్యాచ్ తర్వాత తెలిపారు. కాలి బొటనవేలు గాయంపై 24 నుంచి 48 గంటలు తర్వాత చెబుతామని అన్నారు. ” పేస్‌మెన్ లాకీ ఫెర్గూసన్ మంగళవారం కాలు కండరం చిట్లడంతో టోర్నమెంట్ నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మ్యాచ్ ఆడేందుకు ఫెర్గూసన్ స్థానంలో ఆడమ్ మిల్నేని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెక్నికల్ కమిటీ అనుమతించకపోవడంపై తాను నిరాశకు గురయ్యానని స్టెడ్ చెప్పాడు.
“ఇది మాకు నిజంగా నిరుత్సాహపరిచింది ఎందుకంటే ఆడమ్ మిల్నే ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి. మేము వారి నిర్ణయంపై స్పష్టత కోసం ప్రయత్నిస్తాము. “మా గ్రూప్‌లో పాకిస్తాన్ ఇప్పుడు హాట్ ఫేవరెట్‌గా నంబర్ వన్ సీడ్‌గా ఉందని మీరు ఊహించవచ్చు. మిగిలిన వారు తదుపరి స్థానం కోసం పోరాడుతున్నారు, ఇది భారతదేశం ఆటను చాలా క్లిష్టమైనదిగా చేస్తుంది” అని అతను చెప్పాడు.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. డరైల్ మిషెల్ 20 బంతుల్లో 27 పరుగులు చేయగా.. కాన్వే 24 బంతుల్లో 27 పరుగులు చేశారు. కెప్టెన్ విలియమ్సన్ 25 పరుగులు చేసి వెనుదిరిగాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, హఫీజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి విజయం సాధించింది.
Read Also.. T20 World Cup: అక్తర్‌కు అవమానం..లైవ్ షో మధ్యలోనే బయటకు వెళ్లిపోమన్న హోస్ట్.. కారణమేంటంటే..