ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా ఆల్ రౌండర్..!

|

Aug 12, 2021 | 9:53 AM

ఐసీసీ ర్యాకింగ్స్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. అలాగే బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ టీ 20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు.

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా ఆల్ రౌండర్..!
Jadeja
Follow us on

ICC Rankings: ఐసీసీ ర్యాకింగ్స్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. అలాగే బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ టీ 20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. బుధవారం ఐసీసీ ర్యాకింగ్స్‌ను ప్రకటించింది. ఈమేరకు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్‌ విభాగంలో జడేజా 377 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న బెన్‌స్టోక్స్‌ (370) ను వెనక్కు నెట్టి రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.

ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా అర్థ సెంచరీ చేసి, టీమిండియా మంచి స్కోర్ చేసేందుకు సహాయపడ్డాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. దీంట్లో జడేజా కీలక పాత్ర పోషించిన సంగతి తెలసిందే. అయితే ఇంకో నాలుగు టెస్టులు ఉండడంతో తను నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకునే అవకాశం కూడా ఉంది. విండీస్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ 384 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఇక టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ 901 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్టీవ్‌ స్మిత్‌ 891 పాయంట్లు, మార్నస్‌ లబుషేన్‌ 878 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 846 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండడా, 791 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో పాట్‌ కమిన్స్‌ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ 856 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌లో షకీబ్‌ ఆల్‌ హసన్‌ సత్తా చాటాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచి సిరీస్‌లో ఉత్తమ ప్రతిభ చూపాడు. ఆసీస్‌తో జరిగిన చివరి టీ20లో నాలుగు వికెట్లతో తన కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. 286 పాయింట్లతో షకీబ్‌ టాప్‌లో నిలిచాడు. మహ్మద్‌ నబీ 285 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీ 20 బౌలింగ్‌‌లో తబ్రెయిజ్‌ షంసీ 792 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. వహిందు హసరంగ 764 పాయింట్లతో రెండో స్థానం, 719 పాయింట్లతో రషీద్‌ మూడో స్థానంలో నిలిచాడు. టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 841 పాయింట్లతో డేవిడ్‌ మలాన్‌ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 819 పాయింట్లతో బాబర్‌ అజమ్‌ రెండో స్థానంలో నిలిచాడు.

Also Read: IND vs ENG 2nd Test Preview: ఈసారైన ‘లార్డ్స్‌’ కలిసొచ్చేనా.. కోహ్లీ సేనను భయపెడుతోన్న రికార్డులు.. ఇంగ్లండ్‌తో నేటి నుంచి రెండో టెస్ట్!

India Vs England: టీమిండియాలో రెండు మార్పులు.. మిడిల్ ఆర్డర్‌ మరింత బలం.. ఎవరెవరంటే.?