U19 World Cup: అండర్ 19 ప్రపంచకప్ విజేతగా భారత్.. కట్‌చేస్తే.. ఒక్కపైసా ఇవ్వని ఐసీసీ.. ఎందుకో తెలుసా?

U19 World Cup 2026: అండర్-19 ప్రపంచ కప్ టైటిల్‌ను ఆరోసారి గెలిచిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ దక్కనుందో తెలుసుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు.

U19 World Cup: అండర్ 19 ప్రపంచకప్ విజేతగా భారత్.. కట్‌చేస్తే.. ఒక్కపైసా ఇవ్వని ఐసీసీ.. ఎందుకో తెలుసా?
U19 world cup

Updated on: Feb 07, 2026 | 9:20 AM

Team India U19 World Cup 2026 Winner: అండర్ 19 ప్రపంచకప్ 2026లో భారత జట్టు విజేతగా నిలిచింది. 6వసారి ప్రపంచకప్ ను అందుకుంది. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ లో ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు తరపున వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లో 175 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఆయూష్ మాత్రే సారథ్యంలో అండర్ 19 ప్రపంచప్ హిస్టరీలోనూ తనదైన ముద్ర వేసిన భారత జట్టు.. అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన లిస్ట్ లో అగ్రస్థానం చేరుకుంది.

ప్రైజ్ మనీ లేదు..

ఈ భారీ విజయంతో ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు ఎంత ప్రైజ్ మనీ దక్కనుందో తెలుసుకోవాలని అభిమానులు ఆరా తీస్తున్నారు. కానీ, అసలు విషయం తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే, ఛాంపియన్ భారత జట్టుకు ప్రైజ్ మనీ అందదు. అండర్ 19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లో ఐసీసీ ఎటువంటి ప్రైజ్ మనీ ఇవ్వదు. ఎందుకంటే, ఈ టోర్నమెంట్ యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు, అనుభవంతోపాటు నైపుణ్యాలను పెంచుకోవడానికి రూపొందించింది. అందుకే ఈ ట్రోఫీ విజేత భారత జట్టుకు ఎటువంటి ప్రైజ్ మనీ దక్కదు.

బీసీసీఐ కాసుల వర్షం..

ఐసీసీ నుంచి ఎటవంటి ప్రైజ్ అందకపోయినా.. బీసీసీఐ మాత్రం ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తుంది. 2024 అండర్ 19 విజేతగా నిలిచిన భారత జట్టులోని ప్రతీ క్రీడాకారుడికి రూ. 30 లక్షలు అందించింది. అదేవిధంగా మహిళల టీంకు రూ. 5 కోట్లు అందించింది. ఈ క్రమంలో ఈసారి బీసీసీఐ నుంచి ఎంత ప్రైజ్ మనీ దక్కనుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..