సౌథాంప్టన్: ప్రపంచకప్ సమరంలో భాగంగా మరో ఆసక్తికర పోరు మరికాసేపట్లో మొదలు కానుంది. సౌథాంప్టన్ వేదికగా వెస్టిండీస్- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎన్నో అంచనాలతో మెగాటోర్నీలో అడుగు పెట్టిన సఫారీ జట్టు ఇంత వరకు బోణీ కొట్టలేదు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి తొలి విజయం నమోదు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు కంగారూల చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన విండీస్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
West Indies have won the toss and will bowl first at the Hampshire Bowl! pic.twitter.com/jxETSso448
— Cricket World Cup (@cricketworldcup) June 10, 2019