ICC Chairman and BCCI Secretary Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జైషా ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన జైషాను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు.
ఈ క్రమంలో దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. బెంగుళూరులో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)ని ప్రారంభించడంపై జైషా తన ఆలోచనలను పంచుకున్నారు. శుక్రవారం బెంగళూరులో బీసీసీఐ కొత్త జాతీయ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. భవిష్యత్ క్రికెట్ ప్రతిభను పెంపొందించేందుకు ఇలాంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో దీనిని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ‘బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు చేర్చే మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించిన ఈ ప్రపంచ స్థాయి స్టేడియం, సదుపాయాలు, తర్వాతి తరం క్రికెటర్లను ప్రోత్సహించడంలో, క్రీడా విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో మా అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని షా పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..