U19 World Cup: అండర్-19 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. టీమిండియా తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

|

Sep 22, 2023 | 9:04 PM

శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది జరిగే అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్ జనవరి 13 న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 4న ఫైనల్ జరగనుంది.కాగా అండర్-19 ప్రపంచకప్‌కు శ్రీలంక మూడోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. U-19 ప్రపంచ కప్ 15వ ఎడిషన్‌లో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు

U19 World Cup: అండర్-19 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. టీమిండియా తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?
U19 World Cup
Follow us on

శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది జరిగే అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్ జనవరి 13 న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 4న ఫైనల్ జరగనుంది.కాగా అండర్-19 ప్రపంచకప్‌కు శ్రీలంక మూడోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. U-19 ప్రపంచ కప్ 15వ ఎడిషన్‌లో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయ. చివరగా, ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు ఉండగా, గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘సి’లో ఆస్ట్రేలియా, జింబాబ్వే, నమీబియా, ఆతిథ్య శ్రీలంక, గ్రూప్ ‘డి’లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్ ఉన్నాయి.అండర్‌ 19 ప్రపంచ కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లు జనవరి 13- 21 మధ్య జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో నాల్గవ స్థానంలో ఉన్న జట్టు వారి టోర్నమెంట్‌ను ముగించే ముందు మరో నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో మరో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగియగానే 12 జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. ఈ ఫార్మాట్‌లో, ఆరు జట్లలో రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ ‘ఎ’, ‘డి’ నుండి మొదటి మూడు జట్లు ఒకే గ్రూపులో ఉంటే. గ్రూప్ ‘బి’, ‘సి’ నుండి మొదటి మూడు జట్లతో మరో గ్రూప్ ఏర్పడుతుంది. సూపర్ సిక్స్ దశలో ఒక్కో జట్టు రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రిలిమినరీ గ్రూప్ దశలో వారు తమ స్థానం ఆధారంగా ఇతర గ్రూపుల జట్లతో తలపడతారు. ఉదాహరణకు గ్రూప్ ‘A’లో అగ్రశ్రేణి జట్టు ‘D’లో రెండు, మూడవ జట్టుతో ఆడుతుంది. సూపర్ సిక్స్ గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

నాకౌట్‌లో విజేతలు ఫిబ్రవరి 4న టోర్నీ ఫైనల్స్‌లో ఆడతారు. జనవరి 13న జింబాబ్వేతో ఆతిథ్య శ్రీలంక తన తొలి మ్యాచ్ ఆడనుండడం గమనార్హం. తొలిరోజు మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది భారత్‌. రెండో రోజు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ద్వారా తన వరల్డ్‌ కప్‌ పోరాటాన్ని ప్రారంభించనుంది. కాగా 2022లో యశ్ ధుల్ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

అండర్ – 19 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..