
ICC Men’s T20I Team of the Year for 2024: ఐసీసీ తాజాగా టీ20ఐ టీం ఆఫ్ ది ఇయర్ 2024 జట్టును విడుదల చేసింది. అంతర్జాతీయంగా అద్భుత ప్రదర్శన చేసిన 11 మంది ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో భారత్ నుంచి ఏకంగా నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా, రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఐసీసీ టీ20ఐ ప్రపంచకప్ 2024ని గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ చేసిన సంగతి తెలిసిందే.
భారత్ నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఎంపిక అయ్యారు. ఆస్ట్రేలియా నుంచి డేంజరస్ ప్లేయర్ల ట్రావిస్ హెడ్ ఒక్కడే చోటు సంపాదించుకోగలిగాడు. ఇక ఇంగ్లండ్ జట్టును ఫిల్ సాల్ట్ ఎంపికవ్వగా, పాక్ జట్టు నుంచి బాబార్ ఆజం, వెస్టిండీస్ జట్టు నుంచి నికోలస్ పూరన్ వికెట్ కీపర్‌గా ఎంపికవ్వగా, జింబాబ్వే నుంచి సికిందర్ రాజా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు నుంచి రషీద్ ఖాన్, శ్రీలంక జట్టు నుంచి వాసిందు హసరంగా ఎంపికయ్యారు.
ఐసీసీ పురుషుల టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరణ్ (వికెట్ కీపర్), సికిందర్ రాజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వాసిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
India’s Rohit Sharma captains the ICC Men’s T20I Team of the Year 2024 🌟
Details ➡️ https://t.co/lK0sdx4Zhc pic.twitter.com/1oecBTeGQG
— ICC (@ICC) January 25, 2025
11 మ్యాచ్‌లు, 378 పరుగులు, 121 అత్యధిక స్కోరు, 42.00 సగటు, 160.16 స్ట్రైక్ రేట్, 1 సెంచరీ
15 మ్యాచ్‌లు, 539 పరుగులు, 80 అత్యధిక స్కోరు, 38.50 సగటు, 178.47 స్ట్రైక్ రేట్, నాలుగు హాఫ్ సెంచరీలు
17 మ్యాచ్‌లు, 467 పరుగులు, 103 అత్యధిక స్కోరు, 38.91 సగటు, 164.43 స్ట్రైక్ రేట్, 1 సెంచరీ
24 మ్యాచ్‌లు, 738 పరుగులు, 75 అత్యధిక స్కోరు, 33.54 సగటు, ఆరు అర్ధ సెంచరీలు
21 మ్యాచ్‌లు, 464 పరుగులు, 98 అత్యధిక స్కోరు, 25.77 సగటు, 142.33 స్ట్రైక్ రేట్, రెండు అర్ధ సెంచరీలు
24 మ్యాచ్‌లు, 573 పరుగులు, 133 అత్యధిక స్కోరు, 146.54 స్ట్రైక్ రేట్, 24 వికెట్లు, 5/18 బెస్ట్ బౌలింగ్ ఫిగర్
17 మ్యాచ్‌లు, 352 పరుగులు, 50 అత్యధిక స్కోరు, 16 వికెట్లు, 3/20 బెస్ట్ బౌలింగ్ ఫిగర్
14 మ్యాచ్‌లు, 31 వికెట్లు, 4/14 బెస్ట్ బౌలింగ్ ఫిగర్, 9.58 సగటు, నాలుగు 4 వికెట్లు
20 మ్యాచ్‌లు, 179 పరుగులు, 67 అత్యధిక స్కోరు, 38 వికెట్లు, 4/15 బెస్ట్ బౌలింగ్ ఫిగర్
8 మ్యాచ్‌లు, 15 వికెట్లు, 3/7 బెస్ట్ బౌలింగ్ ఫిగర్, 8.26 సగటు
18 మ్యాచ్‌లు, 36 వికెట్లు, 4/9 బెస్ట్ బౌలింగ్ ఫిగర్, 13.50 సగటు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..