సరిగ్గా 12 ఏళ్ల తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుండగా, నవంబర్ 19న ఫైనల్ జరగనుంది. టోర్నీ ప్రారంభ, చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ ప్రపంచకప్ మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. ఈ 45 రోజుల్లో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. దీనికి ముందు ఈ ప్రపంచ కప్ ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించింది ఐసీసీ. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలను అధికారికంగా ప్రకటించారు ఐసీసీ అధికారులు. 2019 ప్రపంచకప్ ప్రైజ్ మనీనే ఈ ప్రపంచకప్‌కు కూడా కేటాయించారు. ఈ ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ దాదాపు రూ.83 కోట్లు కాగా ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు 33.18 కోట్లు బహుమతిగా అందనుంది. అలాగే ఫైనల్లో ఓడిన జట్టుకు అంటే రన్నరప్ జట్టుకు రూ.16.59 కోట్లు ఇవ్వనున్నారు. అంతేకాకుండా, గ్రూప్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిచినందుకు రూ.33.18 లక్షలు బహుమతిగా అందుతుంది. అలాగే నాకౌట్‌కు చేరుకోలేకపోయిన ఒక్కో జట్టుకు ఒక్కొక్కరికి రూ.82.94 లక్షలు బహుమతిగా అందజేస్తారు.
కాగా అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఏడాది ప్రపంచకప్ ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. గత ఎడిషన్‌లో ఫైనలిస్టులైన ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. మరోవైపు గత దశాబ్దకాలంగా ఐసీసీ ట్రోఫీ అందుకోని భారత్‌కు ఈ ప్రపంచకప్‌నే చక్కని అవకాశం. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుండి, 2013లో ధోని నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం మినహా, ఏ ఏసీసీ ట్రోఫీని గెలుచుకోలేదు. ప్రపంచకప్‌నకు ముందు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత అక్టోబరు 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభించనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..