AFG vs ENG: ఇదేం దంచుడు భయ్యో! భారీ సెంచరీతో చెలరేగిన జద్రాన్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌ భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో భాగంగా ఆ జట్టు ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ రికార్డు సెంచరీ సాధించాడు. కేవలం 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 177 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు.

AFG vs ENG: ఇదేం దంచుడు భయ్యో! భారీ సెంచరీతో చెలరేగిన జద్రాన్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
Ibrahim Zadran

Updated on: Feb 26, 2025 | 6:52 PM

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న డూ ఆర్ డై మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడుతూ రికార్డు సెంచరీ సాధించాడు. 177 పరుగులతో నాటౌట్ గా నిలిచి తమ జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఇక ఆఖర్లో మహ్మద్ నబీ (24 బంతుల్లో 40) కూడా చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కాగా భారీ సెంచరీతో ఇబ్రహీం జద్రాన్‌ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఛాంపియన్స ట్రోఫీ టోర్నీ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు 165 పరుగులతో ఇంగ్లండ్‌కి చెందిన బెన్‌ డకెట్‌ పేరిట ఉండేది. ఇటీవల ఆస్ట్రేలియా మీద డకెట్ ఈ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులకే ఆ రికార్డు తుడిచి పెట్టేశాడు జద్రాన్.

కాగా ఈ మ్యాచ్ లో గెలవడం ఇరు జట్లకు తప్పనిసరి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరి ఈ టార్గెట్ ను ఇంగ్లండ్ ఛేదిస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

జద్రాన్ అభివాదం

అఫ్గానిస్తాన్ ప్లేయింగ్ XI:

రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది (కెప్టెన్), అజ్మతుల్లా, ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI:

బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..