Sivaramakrishnan: జీవితాంతం వర్ణ వివక్షకు గురయ్యాను.. మాజీ లెగ్ స్పిన్నర్ శివరామకృష్ణన్..

|

Nov 29, 2021 | 9:11 AM

భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన జీవితాంతం "వర్ణ వివక్షకు" గురయ్యారని అన్నారు. భారతదేశం తరపున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడిన శివరామకృష్ణన్, ఇంగ్లీష్ క్రికెట్‌ను కుదిపేసిన జాత్యహంకార వ్యాఖ్యల నేపథ్యంలో తన అనుభవాన్ని వెల్లడించాడు...

Sivaramakrishnan: జీవితాంతం వర్ణ వివక్షకు గురయ్యాను.. మాజీ లెగ్ స్పిన్నర్ శివరామకృష్ణన్..
Sivaramkrishanan
Follow us on

భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన జీవితాంతం “వర్ణ వివక్షకు” గురయ్యారని అన్నారు. భారతదేశం తరపున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడిన శివరామకృష్ణన్, ఇంగ్లీష్ క్రికెట్‌ను కుదిపేసిన జాత్యహంకార వ్యాఖ్యల నేపథ్యంలో తన అనుభవాన్ని వెల్లడించాడు. ఇది దురదృష్టవశాత్తూ మన దేశంలోనే జరుగుతుంది” అని శివరామకృష్ణన్ తన ట్విట్టర్ పోస్ట్ చేశారు. “నా కెరీర్‌ మొత్తంలో చాలాసార్లు వర్ణ వివక్షకు గురయ్యా. రంగు గురించిన విమర్శలను ఎదుర్కొన్నా. అన్నిటికంటే బాధ కలిగించే విషయం ఏమిటంటే స్వదేశంలోనూ వివక్షకు గురి కావడం” అని శివరామకృష్ణన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

వివక్షపై శివరామకృష్ణన్ మాత్రమే కాదు తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ కూడా 2017లో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని లేవనెత్తాడు. ముకుంద్ 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. “15 ఏళ్ల వయసు నుంచి విదేశాలకు వెళుతున్నా. నా రంగు గురించి కొంతమంది మాట్లాడుకోవడం, వ్యాఖ్యలు చేయడం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. క్రికెట్‌నుఅనుసరించేవాళ్లకు ఆటగాళ్లు రంగు మారడం గురించి అవగాహన ఉంటుంది. మేం ఎర్రటి ఎండలో సాధన చేస్తాం. సూర్యుడి వెలుగులో గంటల కొద్దీ మైదానంలో ఉంటాం. ఇలాంటప్పుడు రంగుల్లో తేడాలు రావడం కూడా సహజమే” అని అప్పట్లో ముకుంద్‌ ట్వీట్‌ చేశాడు.

గత సంవత్సరం మాజీ పేసర్ దొడ్డ గణేష్ కూడా జాతి వివక్ష గురించి తన అనుభవాన్ని వెల్లడించాడు. మాజీ యార్క్‌షైర్ ఆటగాడు అజీమ్ రఫీక్ పార్లమెంటరీ విచారణలో తాను ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి సాక్ష్యమివ్వడంతో ఇంగ్లీష్ క్రికెట్ ఇటీవల తుఫానుకు కేంద్రంగా మారింది. దీంతో యార్క్‌షైర్ క్లబ్‎పై నిషేధం విధించారు.

Read Also.. IND vs NZ: వృద్ధిమాన్ సాహా అంతిమ పోరాట యోధుడు.. మెడ నొప్పి ఉన్నా ఆడాడు..