MS Dhoni: ధోని వల్లే నాకు అన్యాయం జరిగింది.. విచిత్ర ఆరోపణలు చేసిన మాజీ ప్లేయర్..

India vs Pakistan: 2012లో పాకిస్థాన్ జట్టు చివరిసారిగా భారత్‌ను సందర్శించింది. సయీద్ అజ్మల్ కీలక పాత్ర పోషించిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది.

MS Dhoni: ధోని వల్లే నాకు అన్యాయం జరిగింది.. విచిత్ర ఆరోపణలు చేసిన మాజీ ప్లేయర్..
MS Dhoni

Updated on: Jul 02, 2023 | 1:50 PM

MS Dhoni vs Saeed Ajmal: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు సయీద్ అజ్మల్ టీమిండియా మాజీ సారధి ధోనీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అజ్మల్ ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు ప్రధాన స్పిన్ బౌలర్‌గా నిలిచాడు. కానీ, అతను వన్డే ఫార్మాట్‌లో ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకోలేకపోయాడు. దీనిపై అజ్మల్ తాజాగా మాట్లాడుతూ.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌కు నేను అర్హుడని ప్రకటించాడు. ఆ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లను వదిలేసిన ధోనీకి అవార్డు ఇచ్చారంటూ విచిత్ర ప్రకటన చేశాడు.

ప్రపంచ క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ పేరు కూడా ఉంటుంది. ధోనీ తన వన్డే కెరీర్‌లో 350 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను బ్యాట్‌తో 10 వేలకు పైగా పరుగులు చేసిన చోట, అతను స్టంప్‌ల వెనుక 321 క్యాచ్‌లు, 123 స్టంపింగ్‌లను కూడా తీసుకున్నాడు. అయితే భారత్‌కు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ ధోనీ, తన వన్డే కెరీర్‌లో కేవలం 21 సార్లు మాత్రమే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకోగలిగాడు. ఇందులో 2012లో పాకిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక మ్యాచ్‌ని చేర్చారు.

2012లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి 2 మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా పాకిస్థాన్ సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత, చివరి వన్డే గురించి సయీద్ అజ్మల్ ఓ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడాడు. నా అదృష్టం చెడ్డదని భావిస్తున్నాను అంటూ ప్రకటించాడు. మూడో వన్డేలో భారత్‌ను 175 పరుగులకు కుదించడంలో నాదే కీలక పాత్ర. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాను. అదే సమయంలో ధోనీ 18 పరుగులు మాత్రమే చేయడంతో పాటు, మ్యాచ్‌లో 2 క్యాచ్‌లను కూడా వదిలేశాడు. అలా చేసినా ధోనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ లభించింది. మ్యాచ్‌లో మెరుగ్గా రాణిస్తున్న వారికే ఈ అవార్డు ఇవ్వాలని భావిస్తున్నాను. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. అయితే క్యాచ్‌ను వదిలిపెట్టిన తర్వాత కూడా ధోనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ లభించిందంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆ మ్యాచ్‌లో ధోనీ చేసింది 36 పరుగులు, కేవలం 1 క్యాచ్ డ్రాప్ చేశాడు..

మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో సయీద్ అజ్మల్ ఇచ్చిన ప్రకటన పూర్తిగా తప్పు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 167 పరుగులకే పరిమితమైంది. అదే సమయంలో టీమిండియా బ్యాటింగ్‌లో ధోనీ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. ఇది కాకుండా ఈ మ్యాచ్‌లో ధోని కేవలం 1 క్యాచ్‌ను మాత్రమే అందుకోలేకపోయాడు. దీంతో ఈ పాక్ మాజీ బౌలర్‌పై నెటిజన్లు తీవ్రంగా మండి పడుతున్నారు. ముందు స్టాట్స్ గురించి తెలుసుకుని, మాట్లాడాలంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..